NTV Telugu Site icon

Telangana: మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో కొలువుల జాత‌ర‌..

Seethakka

Seethakka

తెలంగాణలోని మహిళా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్పర్ల ఖాళీల భ‌ర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో.. మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీత‌క్క అందుకు సంబంధించిన ఫైల్‌పై సంత‌కం చేశారు. 6399 అంగ‌న్వాడీ టీచ‌ర్లు, 7837 హెల్పర్ల పోస్టుల భ‌ర్తీకి రంగం సిద్దం చేసింది.

Read Also: AP Government: గ్రూప్‌-2 పరీక్షల్లో ట్విస్ట్‌.. ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ

ఎన్నిక‌ల కోడ్ ముగియ‌గానే ఈ ఉద్యోగ భర్తీకి సంబంధించిన నోటిఫికేష‌న్ జారీ చేయనున్నారు. ఆయా జిల్లా క‌లెక్టర్లు అందుకు సంబంధించిన నోటిఫికేష‌న్లను జారీ చేయ‌నున్నారు. మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భ‌ర్తీ చేయ‌నుంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్పర్ల కొలువులను భ‌ర్తీ చేయ‌డం ఇదే తొలిసారి.. ఖాళీల భ‌ర్తీ ప్రక్రియతో అంగ‌న్వాడీలు మ‌రింత ప‌టిష్టంగా ప‌నిచేయ‌నున్నారు.

Read Also: CM Revanth Reddy: పార్టీ నేతలకు సీఎం క్లాస్.. నేను చేసేది చేసినా ఇక మీ ఇష్టం

కాగా.. తెలంగాణ వ్యాప్తంగా 140 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో దాదాపు 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక ఉపాధ్యాయురాలితోపాటు ఒక హెల్పర్ ఉంటే.. మినీ కేంద్రాల్లో ఒక టీచర్ మాత్రమే ఉంటారు. తాజాగా మినీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేసి పూర్తి అంగన్వాడీ కేంద్రాలుగా చేయడంతో అక్కడ హెల్పర్ పోస్టులు అవసరమయ్యాయి.