Site icon NTV Telugu

Spirit FirstLook : స్పిరిట్ ఫస్ట్ లుక్ అరాచకమే.. కానీ అదే మైనస్

Spirit Firstlook

Spirit Firstlook

న్యూ ఇయర్ గిఫ్ట్‌గా తన సెంటిమెంట్‌లో భాగంగా ఇండియన్ సినిమా ఆజానుబాహుడు.. అంటూ స్పిరిట్ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఈ లుక్ చూసిన తర్వాత అరాచకం అనేలా ఉంది. ఇప్పటి వరకు ప్రభాస్‌ను చూడని విధంగా చూపించాడు వంగా. నోటిలో సిగరెట్, చేతిలో మందు బాటిల్‌తో కనిపించాడు ప్రభాస్. ఆ సిగరెట్‌ను హీరోయిన్‌ త్రిప్తి డిమ్రి వెలిగిస్తుండడం ఫ్యాన్స్‌కు ఎక్కడా లేని హై ఇచ్చింది. అలాగే.. బ్యాక్ లుక్‌లో ఉన్న డార్లింగ్ బాడీ మీద ఉన్న భారీ గాయలు చూస్తే.. ఈ సినిమా ఎంత వైలెంట్‌గా ఉండబోతుందనే దానికి పోస్టర్ ఒక శాంపిల్‌లా ఉంది.

Also Read : Dhurandhar2 : ధురంధర్ 2 దెబ్బకు దుకాణం సర్థుకుంటున్న బాలీవుడ్ సినిమాలు

ఒక్క మాటలో చెప్పాలంటే.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రూత్‌లెస్ కాప్‌గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. ఎక్కడ చూసిన లుక్ గురించే చర్చ జరుగుతోంది. లుక్ ఎలా ఉందంటూ పోల్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభాస్ లుక్‌ అదిరిపోగా, అదొక్కటే మైనస్ అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా స్టైల్‌లో వైల్డ్‌గా ఉన్న స్పిరిట్ లుక్‌.. ఆయన గత సినిమాల హీరోల ఫస్ట్ లుక్‌ని పోలి ఉందని అంటున్నారు. వెనక నుంచి సడెన్‌గా చూస్తే అనిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌లా ఉన్నాడని అంటున్నారు. ముందు నుంచి చూస్తే అర్జున్ రెడ్డి లుక్‌లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి, రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పిలకతో చాలా స్టైలిష్‌గా అదిరిపోయే లుక్‌లో కనిపించాడు ప్రభాస్. దీంతో.. అదే లుక్‌ని వంగా రిలీజ్ చేస్తాడని అంతా భావించారు. కానీ, సందీప్ మాత్రం ప్రభాస్‌ను లాంగ్ హెయిర్‌తో వైల్డ్‌గా చూపించాడు. అందుకే.. అనిమల్, అర్జున్ రెడ్డి లుక్‌తో పోలుస్తున్నారు. కానీ, అక్కడుంది పాన్ ఇండియా కటౌట్, అలాంటి కటౌట్‌తో సందీప్ చేయబోయే విధ్వంసం ఊహకు కూడా అందుకుండా ఉంటుందని రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తంగా.. స్పిరిట్ ఫస్ట్‌ లుక్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా!

Exit mobile version