NTV Telugu Site icon

South Actress : 41 ఏళ్లైనా పెళ్లి వద్దంటోన్న సౌత్ క్వీన్

Trisha

Trisha

హీరోయిన్ గట్టిగా దశాబ్దం వర్క్ చేస్తే కష్టమనుకునే టైం నుండి.. 40 ప్లస్ అయినా కూడా హీరోయిన్లుగా సత్తా చాటగలరన్న పీరియడ్ వరకు టైమ్ ట్రావెల్ చేసింది త్రిష. 41 ఏళ్లు వచ్చినా ఇసుమంతైనా అందం తగ్గలేదు. చెప్పాలంటే అందం డబుల్ అయ్యింది. ఎంగేజ్ మెంట్ క్యాన్సల్ తర్వాత కెరీర్ ఖతం అనుకున్నారు. ఒకటో రెండో ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేసి.. యాక్టింగ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేస్తుందనుకున్నారు. బట్ ఐ యామ్ నాట్ ఎ రెగ్యులర్ యాక్ట్రెస్ అని ఫ్రూవ్ చేసింది ఈ సౌత్ క్వీన్.

Also Read : Upendra : వెరైటీ టైటిల్స్ పెట్టడానికి కారణం అదే

96 దెబ్బకు ఆమె కూడా బిలీవ్ చేయనంత కెరీర్ గ్రాఫ్ స్టార్టైంది. ఇప్పుడు పీక్స్ చేరింది. ఎంతలా అంటే. ఎప్పుడో తనతో వర్క్ చేయడం ఆపేసిన స్టార్ హీరోలు పిలిచి ఆఫర్లు ఇవ్వడం.. ఆమె కోసమే వెయిట్ చేయడం. చాలా రోజుల గ్యాప్ తర్వాత విజయ్‌తో లియోలో జతకడితే.. ఇప్పుడు అజిత్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులిచ్చాడు. విదాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీలో ఈ అమ్మడే హీరోయిన్. ఇక చాన్నాళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్, త్రిష కలిసి థగ్ లైఫ్ చేస్తున్నారు.ఇక తెలుగులో 19 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో జోడీ కడుతోంది ఈ సౌతిండియన్ బ్యూటీ. కెరీర్ స్టార్టింగ్‌లో ఆరులో సూర్య-త్రిష పెయిర్ ఆకట్టుకోగా.. మళ్లీ ఇన్నాళ్లకు కనువిందు చేయనుంది. ఇదే కాదు కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ రామ్, టొవినో థామస్ ఐడెంటిటీ చేస్తోంది. అలాగే కొన్ని రోజుల్లో తనకు సెకండ్ లైఫ్ ఇచ్చిన 96 సీక్వెల్లోనూ కనిపించబోతుంది. ఇలా సీనియర్లతో వరుసగా సినిమాలు చేస్తోంది త్రిష.

Show comments