Upendra : వెరైటీ టైటిల్స్ పెట్టడానికి కారణం అదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియల్ స్టార్ ఉపేంద్రకు కన్నడ నాటనే కాదు.. టాలీవుడ్‌లో కూడా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులో నో డౌట్. ఇలాంటి టైటిల్స్, సినిమాలు ఆయన మాత్రమే తీయగలడేమో అనేలా ఉంటాయి. అయితే వర్సటైల్ టైటిల్స్ పెట్టడానికి రీజన్ ఏంటో రీసెంట్లీ షేర్ చేసుకున్నాడు ఉప్పీ. ష్, రా, ఏ.. ఏంటీ కోప్పడుతున్నారనుకుంటున్నారా.. కాదండీ బాబు.. ఇవి ఉపేంద్ర సినిమా టైటిల్స్. విచిత్రమైన హావ భావాలు పకలన్నా, వెరైటీ టైటిల్స్ పెట్టాలన్నా, విభిన్న కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నా ఉపేంద్ర తర్వాతే ఎవరైనా. సినిమా టైటిల్సేనే కాదు యాక్టింగ్‌తో కూడా పిచ్చెక్కిస్తుంటాడు. 90స్‌లో ఆయన నటనను తిడుతూనే పొడిగిన వారున్నారు. అంత మ్యాడ్ నెస్ క్రియేట్ చేశాడు ఉప్పీ.
Also Read : GameChanger : ‘దోప్’ లిరికల్ సాంగ్ రిలీజ్.. చరణ్ డాన్స్ వేరే లేవల్
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
అంతేనా డిస్టోపియన్ సినిమాలు తీయడంలో దిట్ట. భవిష్యత్తులో ప్రపంచం ఇలా ఉంటుందన్న ఊహాగానాలను తెరపైకి తెస్తుంటాడు. రీసెంట్లీ రిలీజైన యుఐ కూడా ఈ కేటగిరికి చెందినదే. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత కెమెరా పట్టిన ఉపేంద్ర ప్రజెంట్ రాడ్ రియాలిటీని చూపిస్తూ సొసైటీపై సెటైర్స్ వేసి మరోసారి తన మార్క్ చూపించాడు. సినిమా మొదలయ్యే ముందు తెలివైన వాళ్లు థియేటర్ల నుండి వెళ్లిపోండి. మూర్ఖులు సినిమా చూడండి అంటూ సినిమాకు లాజిక్స్ వెతికే వాళ్లకు కౌంటర్ వేసేశాడు. ఇలాంటి సెటైర్స్ వేయడం మేబీ ఉపేంద్రకే చెల్లుతుందేమో. వెరైటీ టైటిల్స్ పెట్టడానికి రీసెంట్లీ రానాతో జరిగిన ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు ఉప్పీ. అప్పట్లో చిన్న బడ్జెట్. వెల్ ఎస్టాబ్లీష్ హీరో కాదు. నేను సినిమా తీస్తున్నాను రా అంటే ఎవరూ చూస్తారు. వెరైటీ పోస్టర్ పెడితే.. ఏంట్రా ఇలాంటి టైటిల్ పెట్టాడు అని తిట్టడానికైనా థియేటర్లకు వస్తారని ఇలా పేర్లు పెట్టినట్లు చెప్పాడు. అలా సక్సెస్ కావడంతో కంటిన్యూ చేసినట్లు చెప్పుకొచ్చాడు.
- Tags
- UIMovie
- UITheMovie
- Upendra
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!