Site icon NTV Telugu

South Cinema : బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కళకళలాడుతున్న సౌత్ ఇండస్ట్రీ..

South Cinema

South Cinema

సంక్రాంతి తర్వాత సౌత్ ఇండస్ట్రీ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. రూ. 200 కోట్లను దాటిన మూవీలను ఫింగర్ టిప్స్‌పై లెక్కించొచ్చు. ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా బాక్సాఫీసును బాగానే దెబ్బతీసింది. కానీ సెకండ్ ఆఫ్ మాత్రం అదరగొట్టేస్తోంది సదరన్ సినీ పరిశ్రమ. ముఖ్యంగా ఆగస్టు ఎండింగ్ నుండి సౌత్‌కి మంచి కాలం వచ్చినట్లే కనిపిస్తోంది. మిశ్రమ టాక్ వచ్చినా కూడా కూలీ రూ. 500 కోట్లతో కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా మారితే.. మాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి.

Also Read : RaviTeja : మాస్ జాతర నుండి ‘హుడియో హుడియో’ రిలీజ్

ఈ ఏడాది మాలీవుడ్ చూసినంత హైస్ మరో ఇండస్ట్రీ చూడలేదనే చెప్పొచ్చు. వంద, రెండు వందల కోట్లు చూడటం గ్రేట్ అనుకున్న ఓ చిన్న చిత్ర పరిశ్రమ రూ. 300 కోట్ల మూవీని టచ్ చేసింది. ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లోక ఏకంగా రూ. 300 కోట్లను కొల్లగొట్టి మాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఎంపురన్, తుడరుమ్ పేరుతో ఉన్న రికార్డ్స్ చెరిపేసింది. ఎంపురన్ ఈ ఏడాది మాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ కాగా, తుడరుమ్ కేరళలో హయ్యెస్ట్ వసూళ్లను రాబట్టుకున్న చిత్రం. ఈ రెండింటి రికార్డ్స్ బ్రేక్ చేసింది లోక.

Also Read : Kannappa : ‘కన్నప్ప’ శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయి

సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత రూ. 300 కోట్లను టచ్ చేసే మూవీ ఏదీ అని ఎదురు చూస్తున్న టాలీవుడ్‌కు ఆగస్టు వరకు చుక్కెదురైంది. హిట్3, కుబేర, మిరాయ్‌ లాంటి హిట్స్ ఉన్నా రూ. 200 కోట్లు లోపే. ఇక రూ. 300 కోట్లు రీచ్ కావడం కష్టమా అనుకుంటున్న తరుణంలో ఓజీ వచ్చి పదిరోజుల్లో టాస్క్‌ కంప్లీట్ చేసింది. రూ.  300 క్రోర్ కొల్లగొట్టి పవన్ తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చవి చూడటమే కాదు ఈ ఇయర్ టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిపాడు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చందన సీమ సెకండాఫ్‌లో చూపించిన మెరుపులే మెరుపులు. ఒక్కటి కాదు ఏకంగా త్రీ ఫిల్మ్స్ వంద కోట్లను రీచయ్యాయి. జులైలో వచ్చిన మహావతార్ నరసింహా రూ. 300 కోట్లను వసూలు చేస్తే సు ఫ్రం సో వంద కోట్లు రాబట్టుకుంది. తాజాగా వచ్చిన కాంతార చాప్టర్ వన్ యానిమేషన్ మైథాలజీ ఫిల్మ్ వసూళ్లను బీట్ చేసి రూ. 350 కోట్లతో ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. మరీ ఇయర్ ఎండింగ్ లోపు కూలీ, ఓజీ, కాంతార, లోకను ఆయా ఇండస్ట్రీల్లో బీట్ చేసే సినిమాలొస్తాయోమో లెట్స్ వెయిట్

Exit mobile version