NTV Telugu Site icon

Womens Wearing Bangles: మహిళలు గాజులు ధరించడం వల్ల ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా?

Bangles

Bangles

Womens Wearing Bangles Reason: హిందూ సంప్రదాయాలలో అనేక విశ్వాసాలు, నమ్మకాలు మన జీవితంలో చోటుచేసుకుంటాయి. ఈ సంప్రదాయాలు తరతరాలుగా వస్తున్నవిగా కనిపిస్తున్నప్పటికీ, వాటి వెనుక ఉన్న ప్రాముఖ్యతను గ్రహించడం చాలా అవసరం. హిందూ సంప్రదాయాల ప్రకారం, వివాహిత స్త్రీలు గాజులు ధరించడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు, శాస్త్రీయ కారణాలతో కూడిన ఆరోగ్యకరమైన అభ్యాసంగా కూడా ఉందని తెలుస్తోంది.

Also Read: Ram Charan Cut-Out Launch: రామ్ చరణ్ రికార్డు బ్రేకింగ్ కటౌట్ కి హెలికాప్టర్ పూలాభిషేకం

హిందూ సంప్రదాయాల్లో గాజులను వివాహిత మహిళలకు ప్రత్యేక చిహ్నంగా పరిగణిస్తారు. వివాహిత స్త్రీ గాజు గాజులను ధరించడం ఆమె వివాహ బంధానికి సంకేతం. గాజు గాజులు ధరించడం సానుకూల శక్తిని ఆకర్షించి, కుటుంబ శ్రేయస్సును పెంపొందించడంలో సహాయపడుతుంది. గాజు గాజుల వల్ల శరీరానికి ఏర్పడే ప్రయోజనాలను సైన్స్ కూడా ధృవీకరించింది.

గాజు గాజులు ధరించినప్పుడు, చేతులు కదలికలో ఉండడం వల్ల స్థిరమైన ఘర్షణ ఏర్పడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్యాంగిల్స్ రింగ్ ఆకారంలో ఉండటం వల్ల శరీరం నుండి వెలువడే సానుకూల శక్తి తిరిగి శరీరంలోకి వెళ్లి, శక్తి సంతులనాన్ని పెంచుతుంది. బ్యాంగిల్స్ ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి, ప్రతికూల భావాలను తొలగించడంలో సహాయపడుతుంది.

Also Read: Viral News: ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన మామ.. పెళ్లి కూతురు ఇంటిపై విమానం నుంచి డబ్బుల వర్షం(వీడియో)

నానమ్మలు చేతులు ఖాళీగా ఉండడం చూసినప్పుడు వెంటనే గాజులు ధరించమని ఎందుకు చెప్పేవారంటే.. ఇది కేవలం సంప్రదాయం పాటించమని మాత్రమే కాదు, అందులో ఉన్న శాస్త్రీయ కారణాలను కూడా వారికి తెలుసు. గాజు గాజులను ఒక ప్రత్యేక అలంకారమే కాకుండా, ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఇంకా సానుకూల శక్తిని పొందడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

Show comments