NTV Telugu Site icon

NASA: నాసాపై కేసు వేసిన ఫ్లోరిడా నివాసి..ఎందుకో తెలిస్తే పరేషాన్ కావాల్సిందే..

Nasa

Nasa

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. అంతరిక్ష విజ్ఞాన రంగంలో ప్రజలు ఈ ఏజెన్సీ పేరును ఎంతో గౌరవంగా తీసుకుంటారు. అయితే.. ఇప్పుడు నాసాకి ఓ వ్యక్తి పెద్ద షాక్ ఇచ్చాడు. అతను అంతరిక్ష సంస్థపై కేసుపెట్టాడు.ఈ వ్యక్తి అమెరికాలోని ఫ్లోరిడాలోని నేపుల్స్ నివాసి. 80,000 డాలర్లు అంటే దాదాపు రూ. 67 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని నాసా నుంచి డిమాండ్ చేశాడు.

READ MORE: Nara Brahmani : నువ్వేంటో తెలియజేశావు.. లోకేష్‌పై బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్‌

అసలేం జరిగిందంటే..నేపుల్స్‌లోని అలెండ్రో ఒటెరో ఇంటిపై అంతరిక్షం నుంచి శిథిలాలు పడ్డాయి. ఈ శిథిలాలు అతని ఇంటి పైకప్పు నుంచి నేల వరకు రంధ్రం చేసాయి. ఈ సంఘటన జరిగినప్పుడు అలెండ్రో ఒటెరో ఇంట్లో లేడు. తన కుటుంబంతో సెలవులో బయటకు వెళ్లాడు. ఇంట్లో అతని కుమారుడు డేనియల్ మాత్రమే ఉన్నాడు. జరిగిన విషయాన్ని కొడుకు డేనియల్ తండ్రికి ఫోన్ చేసి తెలిపాడు. ఓటెరా స్థానిక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘ఇది విన్న తర్వాత నేను వణికిపోయాను. నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. ఇంత బలంతో మా ఇంటి మీద పడటంతో బాగా నష్టం వాటిల్లింది.” అని పేర్కొన్నాడు.ఈ సంఘటన మార్చి 8 న జరిగింది.

READ MORE: TG Inter Supply Results: విడుదలైన ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు..

అలెజాండ్రో ఇంటికి చేరుకున్న అనంతరం 4×1.6 అంగుళాల సిలిండర్‌ను చూశాడు. దాని బరువు సుమారు 1.6 పౌండ్లు అంటే దాదాపు 700 గ్రాములు. తన ఇంటిని ధ్వంసం చేసిన ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందని అతడు ఆలోచించాడు. కాగా.. ఈ సిలిండర్ తన అంతరిక్ష కేంద్రం నుంచి పడిపోయిందని నాసా (NASA) ధృవీకరించింది. కార్గో ప్యాలెట్లపై పాత బ్యాటరీలను అమర్చడానికి దీనిని ఉపయోగించారని తెలిపింది. దీనిని 2021 అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారని.. ఆ వస్తువు భూమి వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే పూర్తిగా కాలిపోతుందని నాసా వెల్లడించింది. దానిలోని ఒక భాగం దాదాపు 3 సంవత్సరాలు అంతరిక్షంలో కొట్టుమిట్టాడిన తర్వాత ఓటెరో ఇంటిపై పడిందని తెలిపింది.

READ MORE: Big Breaking: బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్..!

ఒటైరో నాసాపై కోర్టులో కేసు వెశాడు. అతడి తరఫు న్యాయవాది మికా న్గుయెన్ వర్తీ మాట్లాడుతూ.. ‘ఈ సంఘటన వారి జీవితాలపై చూపిన ఒత్తిడి, ప్రభావానికి తగిన పరిహారం ఇవ్వాలి. ఘటనలో ఎవరికీ శారీరక గాయాలు కాలేదు. అయితే అలాంటి పరిస్థితి విపత్తుగా మారింది. శిథిలాలు ఇతర దిశలో కొన్ని అడుగుల పడిపోయి ఉంటే, తీవ్రమైన గాయం లేదా మరణం సంభవించవచ్చు.” అని పేర్కొన్నాడు.