The RajaSaab Motion Poster: బర్త్‌డే ట్రీట్ అదిరిందిగా.. ‘రాజాసాబ్‌’ సరికొత్తగా ఉన్నాడు!

  • ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్‌ వచ్చేసింది
  • రాజాసాబ్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల
  • సరికొత్తగా ప్రభాస్‌
The Rajasaab Motion Poster

The Rajasaab Motion Poster

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్‌’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూప‌ర్ నాచుర‌ల్ థ్రిల్ల‌ర్‌ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న రాజాసాబ్‌లో మాళవికా మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేడు రెబల్ స్టార్ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా.. మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ది రాజాసాబ్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

మోషన్‌ పోస్టర్‌లో డార్లింగ్ ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌లో ఉన్నాడు. రాజసం ఉట్టి పడే రాయల్‌ లుక్‌లో ఉన్న రాజాసాబ్‌ స్టిల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ప్రభాస్ సరికొత్తగా కనిపించి అభిమానుల్లో జోష్‌ నింపాడు. డార్లింగ్ లుక్‌ చూసి రెబల్ స్టార్ ఫాన్స్ ఆనందపడిపోతున్నారు. ‘రాజసం ఆయన బ్లడ్‌లోనే ఉంది. వివాదరహితుడైన పాలనాదక్షుడు 10 ఏప్రిల్ 2025న వస్తున్నాడు. దీనికే ఇలా అయిపోతే ఎలా.. ముందు ఉంది అసలైన పండగ’ అంటూ మేకర్స్‌ ట్వీట్ చేశారు. ఇక నుంచి తరచుగా అప్‌డేట్స్ ఉంటాయని ఇటీవల నిర్మాత చెప్పారు.

Also Read: Zomato Platform Fee: పండగ వేళ జొమాటో కస్టమర్లకు షాక్.. ఇకనుంచి ఎక్కువ చెల్లించాల్సిందే!

ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ ద‌త్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కోలీవుడ్ క‌మెడియ‌న్ యోగిబాబు, హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా నటిస్తున్నారని న్యూస్ చక్కర్లు కొడుతోంది. రాజాసాబ్ మూవీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ప్ర‌భాస్ త‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తిచేశాడట. ఈ మూవీ బ‌డ్జెట్ దాదాపు 200 కోట్లపైనే అని టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగు, హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో రాజాసాబ్ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు.