Site icon NTV Telugu

The Raja Saab : రాజా సాబ్’ సెకండ్ ట్రైలర్ అప్ డెట్ ..?

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ హారర్-కామెడీ మూవీ 2026 జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ప్రకటనలో భాగంగా కొన్ని నెలల క్రితం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్, సినిమాపై అంచనాలను పెంచారు.

ఇప్పుడు మరో ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 27న జరగనుండగా, వేదికగా హైదరాబాద్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్రఖని, వీ టీవీ గణేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మరి ఈ రిలీజ్ ట్రైలర్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version