Site icon NTV Telugu

Raja Saab: వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్.. “సహానా.. సహానా” అంటూ రెచ్చిపోయాడుగా..!

Raja Saab

Raja Saab

Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, కామెడీ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “ది రాజా సాబ్” (The Raja Saab). ఈ రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా “సహానా.. సహానా” (Sahana Sahana Song Promo) అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.

India vs South Africa 3rd T20I: రెండు మార్పులతో టీమిండియా బరిలోకి.. మొదట బ్యాటింగ్ చేయనున్న దక్షిణాఫ్రికా..

ఈ మెలోడీ సాంగ్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్, నిధి అగర్వాల్ జంటగా ఉన్న ఈ ప్రోమోలో.. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ప్రభాస్ “సహానా.. సహానా” అంటూ ఉంటే సినిమాలో వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్.. కచ్చితంగానేలా కనపడుతుంది. ఇప్పటికే విడుదలైన ‘రెబల్ సాబ్’ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ “సహానా.. సహానా” పూర్తి వీడియో సాంగ్ డిసెంబర్ 17న సాయంత్రం 6.35 గంటలకు విడుదల కానుంది. ఇక ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకెందుకు ఆలస్యం సాంగ్ ప్రోమో ఇక్కడ చూసేయండి.

Pamidi: దారుణం.. పోలీసుపై కత్తితో దాడి చేసిన మతిస్థిమితం లేని యువకుడు..!

Exit mobile version