The Raja Saab : ఓటీటీలో ‘ది రాజాసాబ్’.. ఆ స్పెషల్ సీన్స్‌తో సరికొత్త వెర్షన్!

Rajasaab

Rajasaab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వచ్చిన హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. కంటెంట్ విషయంలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఈ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్‌ను కొంత నిరాశకు గురిచేసింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Also Read : Surya : నా లైఫ్ మార్చిన ‘బ్రహ్మ’ ఆయనే.. స్టేజీపై ఎమోషనల్ అయిన హీరో సూర్య!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ‘ది రాజాసాబ్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన వెర్షన్ కంటే ఓటీటీ వెర్షన్ కొంత భిన్నంగా ఉండబోతోందట. సాధారణంగా రన్ టైమ్ దృష్ట్యా ఎడిటింగ్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తీసేస్తుంటారు. ‘ది రాజాసాబ్’ విషయంలో కూడా అదే జరిగింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే వెర్షన్‌లో ఆ డిలీటెడ్ సీన్స్ (Deleted Scenes) అన్నింటినీ యాడ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అంటే థియేటర్లలో మిస్ అయిన ప్రభాస్ సీన్లను ఇప్పుడు ఓటీటీలో పూర్తిస్థాయిలో చూడొచ్చన్నమాట. ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి.