NTV Telugu Site icon

Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం..కొత్త ఇంజిన్లపై అమరవీరుల పేర్లు

Indian Railways

Indian Railways

దేశం ప్రస్తుతం ఇంత ప్రశాంతంగా ఉందంటే.. సరిహద్దుల్లోని భద్రతా దళం యొక్క త్యాగం ఎనలేనిది. వారు అక్కడ రాత్రింబవళ్లు కాపుకాస్తూ..ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు..కాబట్టే మనం స్వేచ్ఛావాయువును పీలుస్తున్నాం. భారత్ చుట్టుపక్కల ఎటు చూసినా శత్రుదేశాలే ఉన్నాయి. ఎప్పుడు సమయం దొరుకుతుందా..? ఎప్పుడు భారత్ ను నాశనం చేద్దామా? అని చైనా లాంటి శత్రుదేశాలు గుంటనక్కల్లా ఎదురుచూస్తున్నాయి. అలాంటి వారిని ఎదుర్కొంటు..దేశ సేవలో ప్రాణాలు వదులుతున్న సైనిక అమర వీరులకు అరుదైన గౌరవం దక్కింది. భారత రైల్వే అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తోంది.

READ MORE: OTT: ఈ వారంలో ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

భారతీయ రైల్వే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. దేశవ్యాప్తంగా ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా వెళ్లడానికి ఇది సహాయపడుతుంది. రోజూ కోట్లాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. దేశంలోని అమరవీరులను సన్మానించేందుకు ఈ భారతీయ రైల్వే ప్రత్యేక చొరవ తీసుకుంది. భారతీయ రైల్వే ఇటీవలే డీజిల్ ఇంజిన్లను పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త ఇంజిన్లపై దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ..వారి పేర్లను నూతన ఇంజిన్లపై రాయనుంది. ఈ మేరకు భారతీయ రైల్వే గురువారం ఎక్స్ వేదికగా సమాచారం ఇచ్చింది. ఇందుకోసం రైల్వేశాఖ సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా షేర్ చేసింది.

READ MORE: CM Chandrababu: బెంగాల్ మాజీ సీఎం మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

దేశంలోని అమరవీరులకు నివాళులు అర్పించేందుకు, ఈ వీర అమరవీరుల పేర్లను రైల్వే లోకోమోటివ్ డీజిల్ ఇంజిన్‌లకు రైల్వే శాఖ పెట్టనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. దీని కోసం.. రైల్వేస్ కొత్త గ్లీమింగ్ ఇంజిన్‌పై అమరవీరుల పేర్లను వ్రాసిన వీడియో, ఫోటోను కూడా షేర్ చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేస్తూ.. “భారత రైల్వే తన అమరవీరులను స్మరించుకుంటూ వారికి హృదయపూర్వక నివాళులర్పిస్తుంది. ఉత్తర రైల్వే తన డీజిల్ లోకోమోటివ్ ఇంజిన్‌లకు మన వీర వీరుల పేరు పెట్టింది. భారతీయ రైల్వే వారి అసాధారణ నాయకత్వానికి నివాళులర్పిస్తుంది. అత్యున్నత త్యాగానికి నివాళులు అర్పిస్తుంది.” అని రాసుకొచ్చింది.