NTV Telugu Site icon

Prajavani : గాంధీ భవన్‌లో మొదటి రోజు ముగిసిన ముఖాముఖి

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

గాంధీ భవన్‌లో మొదటి రోజు ముఖాముఖి కార్యక్రమంలో ముగిసింది. ఈ సందర్భంగా 285కు పైగా అప్లికేషన్లు మంత్రి దామోదర రాజనర్సింహ స్వీకరించారు. హెల్త్ ఇష్యూస్, 317 బాధితులు, భూ వివాదం, అక్రమ కేసులు, బదిలీలు అంటూ ఫిర్యాదు అందాయి. బీఆర్‌ఎస్ హయంలో రౌడీ షీట్ పెట్టారంటూ మంత్రి ముఖాముఖిలో సిరిసిల్లకు చెందిన యువకుడు ఫిర్యాదు చేశాడు. కేటీఆర్ తనపై తప్పులు కేసులు నమోదు చేశాడని ఫిర్యాదు చేశాడు సదరు యువకుడు. 30 ఫిర్యాదులను అప్పటికప్పుడు అధికారులకు ఫోన్ చేసి మంత్రి దామోదర రాజనర్సింహ పరిష్కారం చేశారు. గాంధీ, ఉస్మానియా, పోలీస్ స్టేషన్లకు చెందిన అర్జీలపై మంత్రి ఫోన్ చేశారు. 3.30 గంటల వరకు నిర్విరామంగా మంత్రి ముఖాముఖి కొనసాగింది.

Minister Payyavula: కల్తీ నెయ్యి నిజం, అపచారం జరిగిందనేది నిజం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. పార్టీకి ప్రభుత్వానికి ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుందని, పార్టీ కార్యకర్తలు,ప్రజలు అనే తేడా లేకుండా అందరి అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఓవర్ నైట్‌లో సమస్యలు పరిష్కారం అవుతాయని మేము అనుకోవడం లేదని, ఓక్కోక్కటి చేస్తే అన్ని పరిష్కారం అవుతాయన్నారు. గతంలో సమస్యలు వినేవారే లేరని, కానీ ఇప్పుడు మేము చాలా సమయం ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొని ప్రజల సమస్యలు విని,పరిష్కరించే దిశగా అడుగులు వేయడం చాలా సంతోషంగా ఉందని, అర్జీలను సంబంధిత శాఖలకు పంపడం జరుగుతుందన్నారు మంత్రి దామోదర. కొన్ని సమస్యలను ఇక్కడే పరిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు.

Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)