పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. కోల్‌కతా లోని సీబీఐ కార్యాలయంలో నిందితుడు సంజయ్ రాయ్, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, ఘటన జరిగిన రాత్రి బాధితురాలితోపాటు నలుగురు వైద్యులను.. అలాగే, ఒక వాలంటీర్ లకు పాలిగ్రాఫ్ పరీక్షలు చేపట్టారు. ఇకపోతే నిందితులు నిజాన్ని బయటపెట్టడానికి, పోలీసులు పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహిస్తారు. దీనిలో లై డిటెక్టర్ యంత్రం ద్వారా అబద్ధాలను గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఇందులో నిందితుడి సమాధానం సమయంలో శరీరంలో సంభవించే మార్పుల ద్వారా, నిందితుడు ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇస్తున్నాడా లేదా అనేది నిర్ధారించబడుతుంది. ఈ పరీక్షలో నిందితుల శారీరక మార్పులని జాగ్రత్తగా స్టడీ చేసి, వారి ప్రతిచర్యను బట్టి సమాధానం నిజమో.. అబద్ధమో.. నిర్ణయించబడుతుంది.
READ MORE: Malayalam cinema: సినిమా రంగంలో మహిళలపై వేధింపులు..సిట్ ఏర్పాటు చేసిన కేరళ సర్కార్..
కాగా.. ఈ ఘటన లో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి పాలీగ్రాఫ్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు ఆదివారం నిర్ధారించారు. రాయ్ ప్రస్తుతం కోల్‌కతా జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఉన్నాడు. అక్కడే లై డిటెక్టర్ పరీక్ష చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు సీబీఐ కార్యాలయంలో పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే, నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ కేసులో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్, బాధితురాలిపై హత్యాచార ఘటన చోటుచేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు వైద్యులు, మరో సివిల్ వాలంటీర్‌కు శనివారం లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. ఆ వివరాలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
