Site icon NTV Telugu

Hyderabad Police : పక్కా ప్లాన్ ప్రకారమే మహిళ హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు..

Malakpet

Malakpet

హైదరాబాద్ లో ఆరు రోజుల క్రితం మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడలో నల్లటి ప్లాస్టిక్‌ కవరులో మొండెం లేని తలను పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి సోదరి, బావ గుర్తించడంతో ఆ మృతదేహాం.. కేర్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసే ఎర్రం అనురాధదిగా పోలీసులు నిర్ధారించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహించేవారనీ.. ఆ డబ్బు విషయంలో తలెత్తిన గొడవల వల్లే హత్యకు గురైనట్లు ఆమె కుటుంబసభ్యులు కూడా చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడు చంద్రమౌళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే అనురాధను నిందితుడు హత్య చేసినట్లు గుర్తించారు. డెడ్‌బాడీని చికెన్ కొట్టే కత్తితో ముక్కలు ముక్కలు నరికి.. తలను మూసీ నదిలో పడేసి.. మిగిలిన శరీర భాగాలను బకెట్లో కుక్కి ఫ్రిజ్‌లో దాచినట్లు పోలీసులు కనిపెట్టారు.

Also Read : TigerNageswaraRao: గజదొంగ చనిపొతే మూడు లక్షల మంది చూడడానికి వచ్చారట

చైతన్యపురిలోని చంద్రమౌళి ఇంట్లో దాచిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు, క్లూస్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుని ఉస్మానియా దవాఖానాకు తరలించారు. నిందితుణ్ని పోలీసులు ఇంటికి తీసుకొచ్చి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రమౌళి ఇంట్లోనే అనురాధ రెంట్‌కు ఉంటున్నట్లు తెలిసింది. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌తో అప్పుల పాలైన ఇంటి ఓనర్‌ చంద్రమౌళి.. అనురాధ దగ్గర సుమారు రూ. 18లక్షలు అప్పు తీసుకున్నాట్లు.. గుర్తించారు.. ఆ డబ్బులు తిరిగి అడగడంతోనే అనురాధను హత్య చేసినట్లు తెలిపారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే అనురాధను హత్యచేసి.. మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read : Car theft: కార్ దొంగిలించిన ముగ్గురు.. ఎవరికీ డ్రైవింగ్ రాదు.. ఆ తర్వాత జరిగింది తెలుసుకుంటే నవ్వాపుకోలేరు..

Exit mobile version