NTV Telugu Site icon

Maharashtra: క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుతో బ్యాట్స్ మెన్‌ మృతి (వీడియో)

Maharashtra

Maharashtra

మహారాష్ట్రలోని జల్నాలో క్రికెట్ ఆడుతూ ఓ క్రీడాకారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్య పరిచింది. జల్నాలోని డాక్టర్ ఫ్రేజర్ బాయ్స్ మైదానంలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘క్రిస్మస్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్’లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఆట ఆడుతూడగా.. మైదానంలో గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు.

READ MORE: Hyderabad: సెల్‌ఫోన్ వాడొద్దని మందలించిన తండ్రి.. కూతురు అదృశ్యం

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాడు బ్యాటింగ్‌ ఆడేందుకు వెళ్తున్నాడు. అకస్మాత్తుగా పిచ్‌పై కూర్చున్నాడు. క్రమంగా అతని పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. అక్కడున్న ప్రత్యర్థి జట్టు క్రీడాకారులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైందో గమనించే సరికే ఆ క్రీడాకారుడు మృతి చెందాడు. పోలీసులు, వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఆటగాడిని ముంబైలోని నలసోపరా నివాసి విజయ్ పటేల్‌గా గుర్తించారు. అయితే.. విజయ్ పటేల్ మరణం వెనుక కారణాన్ని అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. కాగా.. అతను గుండెపోటు కారణంగా మరణించాడని ప్రాథమిక విచారణలో తేలింది.

READ MORE: SP Sindhu Sharma: ట్రై యాంగిల్ సూసైడ్ కేసులో ఎలాంటి ఐ విట్నెస్లు లేవు..

ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. ఆట సమయంలో విజయ్ పటేల్ పూర్తిగా ఫిట్‌గా, ఉత్సాహంగా కనిపించాడు. అయితే.. అతను అకస్మాత్తుగా కిందపడి ఛాతీ నొప్పి తీవ్రంగా ఉందని తెలిపాడు.ఈ ఘటన జల్నాతో పాటు క్రికెట్ ప్రేమికులను కలిచివేసింది. విజయ్ పటేల్ అకాల మరణం పట్ల స్థానిక ప్రజలు, క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నిర్వాహక కమిటీ వెంటనే మ్యాచ్‌ను రద్దు చేసింది. విజయ్ పటేల్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది.

Show comments