Site icon NTV Telugu

Ben Stokes: స్టోక్స్కు ఏమైంది.. చేతి కర్రల సాయంతో ఉన్న ఫొటో వైరల్..!

Ben Stokes

Ben Stokes

ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేలకు రిటైర్ మెంట్ ప్రకటించి.. మళ్లీ వరల్డ్ కప్ కోసం రిటైర్ మెంట్ ను పక్కనబెట్టి వరల్డ్ కప్ 2023 లో ఆడాడు. ఈ టోర్నీలో పలు మ్యాచ్లకు దూరంగా ఉన్న స్టోక్స్… ఆ తర్వాత కొన్ని మ్యాచ్ల్లో ఆడి కొద్దిమేర రాణించాడు. అయినప్పటికీ.. ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాజయాలు మాత్రం తప్పలేదు. ఇదిలా ఉంటే స్టోక్స్ ఎప్పటి నుంచో మెకాలి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే..

Read Also: World AIDS Day 2023: మీరు కూడా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ ఒకటే అని అనుకుంటున్నారా?.. తేడా తెలుసుకోండి..

అయితే వరల్డ్ కప్ ముగియడంతో స్వదేశానికి వెళ్లిపోయిన స్టోక్స్.. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కాగా.. ఆసుపత్రి ఎదుట చేతి కర్రల సాయంతో నిల్చున్న ఫొటోను స్టోక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “ఆసుపత్రిలో చేరాను, డిశ్చార్జి అయ్యాను… శస్త్రచికిత్స జరిగింది… ఇక కోలుకోవడమే మిగిలుంది” అంటూ ట్వీట్ చేశాడు. అయితే స్టోక్స్ చేతికర్ర పట్టుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయ్యో స్టోక్స్ కు ఏమైందంటూ క్రికెట్ అభిమానులు.. తెగ భయపడిపోతున్నారు.

కాగా.. బెన్ స్టోక్స్ టెస్టుల వరకు మాత్రమే ఇంగ్లండ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇండియా పర్యటనకు రానుంది. ఈ పర్యటన కల్లా స్టోక్స్ కోలుకుంటాడా.. లేదా అనేది చూడాలి.

Read Also: Ranbir Kapoor: యానిమల్ సినిమాలో నేను చాలా తప్పులు చేశా..

Exit mobile version