US: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్.. ఆందోళనలో తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి అదృశమయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల అబ్దుల్ మహ్మద్ ఈనెల 9 నుంచి తల్లిదండ్రులతో టచ్‌లో లేడు. ఎలాంటి ఫోన్ సంభాషణ లేదు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలోనే కిడ్నాపర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము అడిగిన డబ్బు ఇవ్వకుంటే.. కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారని పేరెంట్స్ వాపోయారు. తమ కుమారుడి ఆచూకీ తెలియజేయాలంటూ చికాగోలోని ఇండియన్ కౌన్సిల్‌కు తల్లిదండ్రులు లేఖ రాశారు.
ఇటీవలే ఆంధ్రాకు చెందిన 20 ఏళ్ల అభిజిత్ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఫారెస్ట్‌లోని ఓ కారులో అభిజిత్ మృతదేహం లభ్యమైంది. డబ్బు లేదా ల్యాప్‌టాప్ కోసం దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే మరో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఏడాది నుంచి భారత సంతతికి చెందిన పలువురు అమెరికాలో మృత్యువాతపడుతున్నారు.
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్‌కు ప్రణాళిక
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
తాజాగా అబ్దుల్ మహ్మద్ మిస్సింగ్‌తో పేరెంట్స్ కలవరపడుతున్నారు. మార్చి 7వ తేదీ నుంచి అబ్దుల్ మహ్మద్ తమతో మాట్లాడలేదని కుటుంబీకులు చెబుతున్నారు. ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు గత మే నెలలో అబ్దుల్ మహ్మద్ అమెరికా వెళ్లాడు. ఇంతలో అతడు కిడ్నాపర్ల చెరలో చిక్కికున్నాడు.
గత వారం తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహ్మద్ సలీమ్ తెలిపారు. తన కొడుకును క్లీవ్‌ల్యాండ్‌లో డ్రగ్స్ ముఠా కిడ్నాప్ చేశారంటూ పేర్కొన్నాడు. డబ్బు ఇవ్వకుంటే.. కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారని సలీమ్ తెలిపాడు. సమాచారం అందగానే అమెరికాలో ఉన్న బంధువులకు సమాచారం అందించారు. అనంతరం వారు క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహ్మద్ తెల్లటి టీ షర్ట్, ఎరుపు రంగు స్వెటర్, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నాడని ఫిర్యాదులో బంధువులు పేర్కొన్నారు. అలాగే అతడి ఆచూకీ కోసం చికాగోలోని ఇండియన్ కౌన్సిల్‌కు లేఖ కుటుంబ సభ్యులు లేఖ రాశారు.
అమెరికాలో గత వారమే ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన అభిజిత్ పరుచూరు (20) కారులో శవమై కనిపించాడు. బోస్టన్లోని యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మూడు నెలల వ్యవధిలో అమెరికాలో భారత సంతతికి చెందిన వారు మృతి చెందడం ఇది తొమ్మిదవ ఘటన.
తాజావార్తలు
-
Nandini Reddy: “నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి..” పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
-
DSP Bheem Reddy : విల్లాలు.. ఫ్లాట్లు.. కిలోల బంగారం.. డీఎస్పీ ఆస్తుల లెక్క ఇదే!
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్‌కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!