The Paradise Release Date: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మ్యాట్ ఫినిష్ బ్యాక్, Dimensity 6300 ప్రాసెసర్, 50MP కెమెరాతో Honor X6d బడ్జెట్ 5G ఫోన్ లాంచ్!
ఈ యాక్షన్ డ్రామాను ఆగష్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్ సినిమా ఎలా ఉంటుందో చెప్పేస్తుంది. ఇందులో రెండు జడలు, వాటి చివరన రక్తం కారుతున్నట్లు చూపించడం చూస్తుంటే.. ఈసారి నాని మరింత ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నాడని అర్థమవుతోంది. ఈ సినిమాను మేకర్స్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల చేస్తున్నారు.
Jos Buttler: 122 మీటర్ల క్యాచ్.. గిన్నిస్ బుక్‌లో చేరిన జోస్ బట్లర్!
నాని సరసన కయాదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు.
