The Paradise: ప్యారడైజ్ రిలీజ్ డేట్ మారుతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: ఒక పాట ప్రోమోతో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్న సినిమా ది ప్యారడైజ్. ఆ పాట ఆయా షేర్. ప్రోమోతోనే సంచలనం సృష్టించిన ఈ పాట రిలీజ్ అయిన తర్వాత నయా రికార్డ్‌లతో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. ఈ క్రేజీ సినిమా మరో మారు పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది.
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా అనుకున్న ప్రకారమే ఆగస్టు 21కి ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని టాక్. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అండ్ టీమ్ ఈ సినిమాను అనుకున్న డేట్‌కే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సోషల్ మీడియా వేదికగా ప్యారడైజ్ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాలపై చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. నిజానికి ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉండగా, దానినే ఆగస్టు 21కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నాచురల్ స్టార్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా కనువిందు చేయనుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం.
READ ALSO: Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!