Site icon NTV Telugu

Video Viral: విమానంలో విరాళం సేకరిస్తున్న పాకిస్థానీ.. మదర్సాలు నిర్మాణం కోసమేనట..!

Flight

Flight

విమానంలో ఓ ప్రయాణికుడు తన సహ ప్రయాణీకులను డబ్బును విరాళంగా ఇవ్వమని కోరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పాకిస్థానీ వ్యక్తి తనకు డబ్బు ఇవ్వాలని విమానంలోని ప్రయాణికులను అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే తాను అడుక్కోవడం లేదని, లాహోర్‌లో మదర్సా నిర్మించేందుకు నిధులు సేకరిస్తున్నానని ఆ వ్యక్తి స్పష్టం చేశాడు.

Seediri Appalaraju: పవన్‌కు మంత్రి సీదిరి సవాల్.. దమ్ముంటే ఆ పని చేయాలి

ఈ వీడియోలో నీలం రంగు జాకెట్‌తో తెల్లటి కుర్తా పైజామా ధరించిన వ్యక్తి.. విమానం మధ్యలో నిలబడి డబ్బులు అడుగుతున్నాడు. “మేము మదర్సా నిర్మించడానికి నిధులు సేకరిస్తున్నాము” అని అతను తన సహ ప్రయాణికులకు తెలిపాడు. “మీరు విరాళం ఇవ్వాలనుకుంటే, లేచి నా దగ్గరకు రాకండి. నేను మీ సీటుకు వస్తాను.”అని తెలిపాడు.

Ashu Reddy : ఫారెన్ వీధుల్లో హాట్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న హాట్ బ్యూటీ..

ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారో స్పష్టంగా తెలియనప్పటికీ.. రెండు వారాల క్రితం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిన్న ట్విట్టర్‌లో అనేక ఖాతాలు పోస్ట్ చేయడంతో ఈ వీడియో పాపులర్ అయింది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న సమయంలో ఈ వీడియో సోషల్ మీడియాలో ఉద్భవించిందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది వీక్షకులు ఆ వ్యక్తిని అక్తర్ లావాగా గుర్తించి కామెంట్ చేశారు.

 

Exit mobile version