Online Passport Portal Shut For 5 Days: నిర్వహణ కార్యకలాపాల కారణంగా పాస్ పోర్ట్ సేవా పోర్టల్ సేవలకు విరామం కలగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపిన ప్రకారం..,ఈ సేవలు నేటి రాత్రి నుంచి ఐదు రోజుల పాటు సేవలు నిలిపివేయబడతాయి. అయితే ఈ రోజుల్లో ఇప్పటికే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నవారి అపాయింట్మెంట్లను మాత్రం రీషెడ్యూల్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ రీషెడ్యూల్ చేసిన వివరాలను ఆయా అభ్యర్థులకు వ్యక్తిగతంగా పంపుతామని తెలిపారు. ఇక నేడు గురువారం, ఆగస్టు29 రాత్రి 8గంటల నుంచి ఆన్‌లైన్ పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోతాయని అధికారులు తెలిపారు.
Telugu Language Day 2024: తెలుగు భాషా దినోత్సవం.. తెలుగు వెలగాలి.. తెలుగు భాష వర్థిల్లాలి..
ఈ సేవలు 5 రోజులపాటు అంటే సెప్టెంబర్ 2వరకు ఎలాంటి కొత్త అపాయింట్మెంట్‌లు బుక్ చేసుకునే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. ఎవరైనా పాస్ పోర్ట్ తీసుకోవడం, పాస్ పోర్ట్ రెన్యువల్ వంటి సేవలు పొందడానికి ఉపయోగించే ఈ ఆన్‌లైన్ పోర్టల్ వినియోగదారులకు ఈ సమయంలో అసౌకర్యం కలుగుతుందని అధికారులు తెలిపారు.