Site icon NTV Telugu

BRS: కంటోన్మెంట్ ఉపఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత..?

Brs 1

Brs 1

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చలు కొనసాగాయి. తాజాగా.. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లి నివేదితను ఖరారు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కాగా.. అధికారికంగా మంగళవారం నివేదిత పేరును ప్రకటించనున్నారు.

Read Also: Tata Madhu: తన స్వార్థం కోసం నియోజవర్గ ప్రజలను అవహేళన చేశాడు.. తెల్లం వెంకట్రావుపై కీలక వ్యాఖ్యలు

కాగా.. ఈరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి వచ్చిన కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు.. కేసీఆర్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మా రెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read Also: Extra-marital relationship: వివాహిత ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియుడు.. చివరకు..

Exit mobile version