NTV Telugu Site icon

Marriage: మటన్ తెచ్చిన చిచ్చు.. ఆగిపోయిన పెళ్లి..!

Marraige

Marraige

Marriage: మనం ఎవరి పెళ్లికైనా వెళ్తే.. లగ్గం అవ్వగానే వచ్చి భోజనాల మీద పడుతరు. అక్కడ వడ్డించే వారు మనకు ఒక మటన్ ముక్క తక్కువేస్తే.. మనసులో వీడేంటీ పక్కనోళ్లకే ఎక్కువేసి నాకు తక్కువ వేస్తున్నాడని ఫీలవుతాం. ఎందుకంటే పెళ్లిలో మటన్ కూర ఉంటే లొట్టలేసుకొని తింటారు. ఐతే పెళ్లిలో మటన్ తక్కువైందని పెళ్లే ఆగిపోయింది. ఈఘటన ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఒకటి చోటుచేసుకుంది. సంబల్ పూర్ కు చెందిన యువతి సుందర్‌గడ్‌కు చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటున్నది. ఈ పెళ్లి విందులో వంటకాలు అన్నీ రెడీ చేసి పెట్టారు.. అందులోనూ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా ఉంది.

Read Also: Project K: ఓరి బాబో.. రూమర్స్ తోనే చచ్చిపోయేలా ఉన్నాం.. అది నిజమో కాదో చెప్పండయ్యా

పెళ్లి కొడుకు కుటుంబం పెళ్లి వేదిక వద్దకు వెళ్లగానే.. పెళ్లికి వచ్చిన వారంతా భోజనానికి వెళ్లారు. అందరూ తిన్నారు కానీ.. చివరలో ఓ ఐదారుగురు మందికి మాత్రం మటన్ ముక్క దొరకలేదు. దీంతో వారికి మటన్ తీసుకురావాలని పెళ్లి
కొడుకు సైడ్ వాళ్లు డిమాండ్ చేశారు. మాకు మటన్ వేయండి.. లేదంటే పెళ్లినే రద్దు చేస్తామంటూ ఓ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో చేసేదేమీ లేక పెళ్లి కూతురు తరుపున కుటుంబ సభ్యులు వెంటనే అదే రాత్రి సమీప రెస్టారెంట్ నుంచి మటన్ తీసుకువచ్చి వారిక వడ్డించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే..!

Read Also: Dimple Hayathi : ఆ స్పెషల్ సాంగ్ తన కెరీర్ కు ప్రాణం పోసింది…!!

ఈ మటన్ విషయం పెళ్లి కూతురికి తెలిసింది. ఆమె వెంటనే పెళ్లిని రద్దు చేసింది. కేవలం మటన్ లేదనే కారణంతో తన తల్లిదండ్రులను అవమానపరిస్తే.. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని తనకూ ఇష్టం లేదని చెప్పేసింది. పాపం వరుడు వధువును బ్రతిమిలాడుకుంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు. అయినా.. వధువ వినలేదు. వరుడి కుటుంబం తరుపున నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ససేమిరా అంది. ఇంకేముంది పెళ్లి ఆగిపోయింది.
చేసేదేమి లేక అందరు అక్కడి నుండి వెళ్లిపోయారు.