Site icon NTV Telugu

Virat Kohli: కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తే అంత డిస్కౌంట్.. బిర్యానీ కోసం ఎగబడ్డ జనం

Biryani

Biryani

Virat Kohli: న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. నిన్నటి సెంచరీ విరాట్ కు 50 సెంచరీ కావడంతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే.. కోహ్లీ సెంచరీని ఊహించని.. ఉత్తరప్రదేశ్ లోని ఓ రెస్టారెంట్ యజమాని ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కోహ్లీ కివీస్ తో మ్యాచ్ లో ఎన్ని రన్స్ కొడితే తన రెస్టారెంట్ లో బిర్యానీపై అంత పర్సెంటేజీతో డిస్కౌంట్ ఇస్తానని అన్నాడు.

Read Also: Pakistan: పాకిస్తాన్ కార్ మార్కెట్ ఢమాల్.. దాయాదితో పోలిస్తే భారత్‌లో 100 రెట్లు ఎక్కువ అమ్మకాలు..

ఇంకేముంది.. ఆ రెస్టారెంట్ కు జనాలు ఎగబడ్డారు. కోహ్లీ సెంచరీ కొట్టడంతో బిర్యానీని 100 శాతం డిస్కౌంట్ తో ఫ్రీగా ఇచ్చాడు. ఈ ఆఫర్ బహ్రెయిచ్ ప్రాంతలోని ‘లక్నో రసోయి’ అనే రెస్టారెంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న బిర్యానీ ప్రియులు రెస్టారెంట్ కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మొదటగా వచ్చిన వారికి బిర్యానీ దొరికింది.. కానీ ఆ తర్వాత బిర్యానీ అయిపోయింది. అయినప్పటికీ జనాల తాకిడి ఆగలేదు. దీంతో బిర్యానీ లేదన్న జనాలు వినకపోవడంతో చివరికి రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి కొంతమందిని కంట్రోల్ చేశారు. అయినప్పటికీ.. క్యూలో ఉన్న వారు తమకు బిర్యానీ ఇవ్వాల్సిందేనంటూ గొడవకు దిగారు. దీంతో రెస్టారెంట్ ఓనరు చేసేదేమీ లేక షట్టర్లు మూసేశాడు. ఆ తర్వాత ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు.

Read Also: Salaar: సలార్ నైజాం హక్కులు.. రూ. 90 కోట్లు.. ఎవరు దక్కించుకున్నారంటే.. ?

Exit mobile version