Salaar: సలార్ నైజాం హక్కులు.. రూ. 90 కోట్లు.. ఎవరు దక్కించుకున్నారంటే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్.. ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. డిసెంబర్ 1 న ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో పాటు.. రెండు రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అధికారికంగా వెల్లడిస్తున్నారు.
Naga Chaitanya: ఎంత మంచి మనసు సామీ నీది.. ఎక్కేశావ్ .. అభిమానుల గుండెల్లో ఓ మెట్టు ఎక్కేశావ్
Also Read
నిన్నటికి నిన్న.. ఏపీ డిస్ట్రిబ్యూటర్స్‌ను అనౌన్స్ చేశారు. ఉత్తరాంధ్రలో శ్రీ సిరి సాయి సినిమాస్, తూర్పుగోదావరిలో లక్ష్మీ నరసింహ శ్రీ మణికంఠ ఫిలిమ్స్, పశ్చిమ గోదావరిలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, కృష్ణా, గుంటూరు రీజియన్లలో కెఎస్ఎన్ టెలి ఫిలిమ్స్, నెల్లూరులోని శ్రీ వెంగబాంబ సినిమాస్, సీడెడ్‌లోని శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్ సలార్ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక అవన్నీ సరే కానీ, నైజాం ఎవరికీ వెళ్ళింది అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. ఇక ఎట్టకేలకు దానికి కూడా సమాధానం దొరికింది. సలార్ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా మేకర్స్ తెలిపారు. దాదాపు రూ. 90 కోట్లు భారీ మొత్తంలో చెల్లించి నైజాం హక్కులను పొందినట్లు సమాచారం. సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాను నైజాంలో రిలీజ్ చేయడమంటే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఆ ఛాన్స్ ను మైత్రీ మూవీ మేకర్స్ పట్టేశారు. ఇప్పటికే నేషనల్ అవార్డు ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకుంది మైత్రీ. పుష్ప సినిమాను మైత్రీనే నిర్మించింది. ఇప్పుడు పుష్ప 2 తో బిజీగా ఉంది. మరి సలార్ తో మైత్రీ ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.
Excited to partner with @MythriOfficial as we present #SalaarCeaseFire to the incredible audience of 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 (𝐍𝐢𝐳𝐚𝐦).#Salaar Trailer on Dec 1st at 7:19 PM 🔥#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/R82WtxBVj4
— Hombale Films (@hombalefilms) November 16, 2023
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!