NTV Telugu Site icon

Mahabubabad: మద్యం మత్తులో వైద్య సిబ్బంది హల్ చల్.. తాగిన మైకంలో పోసేశాడు..!

Mhbd

Mhbd

Mahabubabad: మహబూబూబాద్ జిల్లా హాస్పిటల్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో హల్చల్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. యాక్సిడెంట్ అయిన బాధితులకు వారు కట్లు కట్టుతున్నారు. అంతేకాకుండా వారు ఫేషెట్ల్ ముందే అసభ్యంగా ప్రవర్తించారు. ఫుల్ గా తాగి రూమ్ వార్డులోనే చెత్త డబ్బాలో మూత్రం పోశారు. మమ్మల్ని ఎవరు ఏమి అనలేరని.. నానా హంగామా చేశారు. దీంతో అక్కడున్న పేషెంట్లు, అటెండెంట్లు భయాందోళనకు గురయ్యారు.

Read Also: Minister Venugopala Krishna: పవన్‌కి మంత్రి వేణు స్ట్రాంగ్ కౌంటర్.. బాబు ట్రాప్‌లో..

సాయి ఏజెన్సీ ద్వార రిక్రూట్ మెంట్ అయిన ఈ ఇద్దరు పై పలు అరోపణలు వచ్చాయి. యాక్సిడెంట్ అయిన వారికి M. N. 0 చేయాల్సిన పనులు.. స్టేచర్ వాళ్ళతో వైద్య సిబ్బంది కట్లు కట్టిస్తుంది. మరోవైపు మద్యం మత్తులో ఉన్న సిబ్బందిపై.. ఆస్పత్రి పేషేంట్లు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై చాలాసార్లు ఫిర్యాదులు చేసినా.. ఇంత జరుగుతున్న జిల్లా సూపరిడెంట్ పట్టించుకోవడంలేదని పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఆస్పత్రిలో హంగామా వీడియో వాట్సాప్ లో చక్కర్లు కొడుతుంది. చూడాలీ మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు.. వారిపై యాక్షన్ తీసుకుంటారా.. లేదంటే మాములే అని వదిలేస్తారా..?

Show comments