NTV Telugu Site icon

Supreme Court: ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి.. 30 ఏళ్ల జైలు శిక్ష

Rape

Rape

మధ్యప్రదేశ్‌లో ఓ బాలికను ఆలయానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అనంతరం ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ అత్యాచార ఘటన 2018లో జరిగింది. మైనర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేరం చేసే సమయానికి నిందితుడి వయస్సు 40 ఏళ్లు.

Read Also: The Kerala Story: హమ్మయ్య.. ఎట్టేకలకు వివాదాస్పద సినిమా ఓటిటీకి వచ్చేస్తోంది

ఈ ఘటనపై స్థానిక కోర్టు అతనిని దోషిగా తేల్చింది. అంతేకాకుండా సెక్షన్ 376B (12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికపై అత్యాచారం) కింద మరణశిక్ష విధించింది. కానీ ఆ తర్వాత.. మధ్యప్రదేశ్ హైకోర్టు దోషికి ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా.. రూ.లక్ష జరిమానా విధించింది. అతని చర్యలు “అనాగరికం” అని పేర్కొంది. బాధితురాలు గుడికి వెళ్లిన ప్రతిసారి, ఆ ఘటన ఆమెను వెంటాడుతుంది. ఆమెకు జరిగిన అన్యాయం గుర్తొస్తూనే ఉంటుంది. అది.. భవిష్యత్తులో తన వైవాహిక జీవితంపైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని జస్టిస్​ సీ టీ రవికుమార్​, జస్టిస్​ రాజేశ్​ బిందాల్​తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Read Also: Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు

మరోవైపు.. నిందితుడి వయస్సును కూడా పరిగణించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే నిందితుడు జైలులో ఉన్నాడు.. పశ్చాతాపం పడుతున్నాడు. వీటిని పరిగణలోకి తీసుకుని.. నిందితుడికి 30ఏళ్ల జైలు శిక్షని విధిస్తున్నాము. ఇప్పటికే గడిపిన జైలు జీవితం కూడా ఇందులో భాగమే అని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.