Supreme Court: ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి.. 30 ఏళ్ల జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లో ఓ బాలికను ఆలయానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అనంతరం ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ అత్యాచార ఘటన 2018లో జరిగింది. మైనర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేరం చేసే సమయానికి నిందితుడి వయస్సు 40 ఏళ్లు.
Read Also: The Kerala Story: హమ్మయ్య.. ఎట్టేకలకు వివాదాస్పద సినిమా ఓటిటీకి వచ్చేస్తోంది
Also Read
- Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
- Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
ఈ ఘటనపై స్థానిక కోర్టు అతనిని దోషిగా తేల్చింది. అంతేకాకుండా సెక్షన్ 376B (12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికపై అత్యాచారం) కింద మరణశిక్ష విధించింది. కానీ ఆ తర్వాత.. మధ్యప్రదేశ్ హైకోర్టు దోషికి ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా.. రూ.లక్ష జరిమానా విధించింది. అతని చర్యలు “అనాగరికం” అని పేర్కొంది. బాధితురాలు గుడికి వెళ్లిన ప్రతిసారి, ఆ ఘటన ఆమెను వెంటాడుతుంది. ఆమెకు జరిగిన అన్యాయం గుర్తొస్తూనే ఉంటుంది. అది.. భవిష్యత్తులో తన వైవాహిక జీవితంపైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని జస్టిస్ సీ టీ రవికుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Read Also: Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు
మరోవైపు.. నిందితుడి వయస్సును కూడా పరిగణించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే నిందితుడు జైలులో ఉన్నాడు.. పశ్చాతాపం పడుతున్నాడు. వీటిని పరిగణలోకి తీసుకుని.. నిందితుడికి 30ఏళ్ల జైలు శిక్షని విధిస్తున్నాము. ఇప్పటికే గడిపిన జైలు జీవితం కూడా ఇందులో భాగమే అని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.
- Tags
- A Girl
- a man
- Madhya Pradesh
- Prison
- rape
తాజావార్తలు
-
Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. ‘పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
-
Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
-
Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
-
PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!