Site icon NTV Telugu

Uttar Pradesh: దొంగతనం చేశాడని యువకుడిని స్తంభానికి కట్టి కొట్టిన స్థానికులు

Up

Up

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌లోని పోష్ కాలనీలో.. ఓ యువకుడిని స్థానికులు స్తంభానికి కట్టి దారుణంగా కొట్టారు. దొంగతనం చేశాడనే ఆరోపణలపై కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. అయితే బాధితుడిని కొట్టిన వ్యక్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Israel-Hamas War: భారీ పంపులను సిద్ధం చేస్తున్న ఇజ్రాయిల్.. హమాస్ టన్నెల్స్‌లో వరదలకు ప్లాన్..

ఇదిలా ఉంటే.. యువకుడు కొట్టొద్దని ఎంత బ్రతిమిలాడిన స్థానికులు వినడం లేదు. అయినప్పటికీ రక్తం వచ్చేలా చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరోవైపు.. అక్కడ ఈ ఘటన జరుగుతున్నంత సేపు జనాలు ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు. అంతేకాకుండా.. కొడుతున్న వ్యక్తికి మద్దతు ఇస్తున్నారు.

Read Also: Revanth Reddy Tweet: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. తొలి పోస్ట్ ఇదే..!

యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన వారిలో అమిత్ శర్మ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు మరికొందరిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసేందుకు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిందితుడు, బాధితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అమిత్ చరిత్రను పరిశీలిస్తే.. సదరు యువకుడు వికలాంగుడిపై దాడి చేసినట్లు తేలింది. ప్రస్తుతం బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version