కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ వచ్చింది.మొదట్లో ఈ సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రాను రాను ఈసినిమా పై పాజిటివిటి పెరిగింది. త్వరలోనే లియో సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైది విక్రమ్ సినిమాలతో లియో మూవీ లింక్ అయ్యి ఉండటంతో ఈ మూవీ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విక్రమ్ లోలా క్లైమాక్స్ లో స్టార్ హీరో ఎంట్రీ ఉంటుందని అంతా ఊహించారు.కానీ చివర్లో కేవలం కమల్ హాసన వాయిస్ మాత్రమే ఉండటంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు..
మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికి లియో మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే లియో ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ లియో డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకుంది.నేటి (నవంబర్ 24)నుంచి లియో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. నిన్న అర్ధరాత్రి నుంచి లియో మూవీ ను స్ట్రీమింగ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. మంచి వ్యూస్ సంపాదించుకుంటున్న లియో ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం గా కనిపిస్తుంది. లియో సినిమాలో విజయ్ రెండు డిఫరెంట్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. అలాగే మడోనా సెబాస్టియన్ మరో కీలక పాత్రలో నటించింది.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాక్ హైలెట్ గా నిలిచింది.