NTV Telugu Site icon

Jagtial District : ఇడ్లీలో జెర్రీ.. నోట్లో వేసుకున్న హోటల్ యజమాని..

Jagityal

Jagityal

ఇడ్లీలో జెర్రీ ప్రత్యక్షమైన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ప్రముఖ గణేష్ భవన్ ఉడిపీ హోటల్‌లో ఓ కస్టమర్ ఇడ్లీ పిల్లలకు తినిపించే సమయంలో చనిపోయిన జెర్రీ కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్ ఓనర్‌తో వాగ్వాదానికి దిగారు. జెర్రీ కాదంటూ దారమని ఓనర్ వాదించాడు. నోట్లో వేసుకున్న ఓనర్.. జెర్రీ అని తేలడంతో ఉమ్మేశాడు. వెంటనే ఇడ్లీలను బల్దియా టాక్టర్‌లో తరలించేకు హోటల్ నిర్వహకులు ప్రయత్నం చేశారు. పలువురు అడ్డుకుని ఇడ్లీలతో రోడ్డుపై బైఠాయించారు. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు.

READ MORE: Baba Siddique Murder: కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. బాబా సిద్ధిక్ హత్యపై రాజకీయ దుమారం..

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కల్తీ ఆహారం పెరుగుతోంది. ఆహార కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి హానీకరం. కల్తీ ఆహార పదార్థాల్లో హానీకరమైన రంగులు, రసాయనాలు వాడడం వల్ల ప్రాణాంతక కేన్సర్‌కు కారణమవుతున్నాయి. మరికొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడై ప్రాణాంతకంగా మారుతోంది. కల్తీ వల్ల విరేచనాలు, కడుపునొప్పి, కీళ్ల నొప్పులు వస్తున్నాయి. కొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కల్తీ ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా, రుచిగా తయారు చేయడానికి ఎన్నో రసాయనాలను కలుపుతున్నారు. ఆహార పదార్థాల్లో అల్యూమినియం, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మెదడు, ఎముకలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. అందరూ జాగ్రత్తలు వహించాలి.