Shocking : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. తదుపరి కార్యక్రమాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేశారు. సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆఖరి క్రతువు నిర్వహించేందుకు మృతదేహాన్ని పాడె పై నుంచి.. చితి పైకి మారుస్తుండగా.. చనిపోయిందని భావించిన ఆమె ఒక్కసారిగా కళ్లు తెరిచింది. దీంతో కుటుంబసభ్యులందరూ నలుదిక్కులకు పరిగెత్తారు. ఫిరోజాబాద్ ప్రాంతానికి చెందిన హరిభేజి తీవ్ర అనారోగ్యం కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.
Read Also: ROBO Lawyer: తొలిసారి కోర్టులో వాదించనున్న రోబో లాయర్
అక్కడ చికిత్స పొందుతున్న హరిభేజికి ఈ నెల 3న మెదడులో రక్తం గడ్డకట్టిందని, దీంతో ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. దాంతో కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. హరిభేజిని కడసారి చూసేందుకు బంధువులు అందరూ వచ్చారు. మృతదేహాన్ని పాడెపై నుంచి చితిపైకి మారుస్తుండగా హరిభేజి ఒక్కసారిగా కళ్లు తెరిచింది. దాంతో అంత్యక్రియలకు హాజరైన బంధుమిత్రులు షాక్ గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికే తేరుకుని వృద్ధురాలిని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లారు. అయితే.. మరుసటిరోజే హరిభేజీ అనారోగ్యంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దాంతో బుధవారం మరోసారి బంధుమిత్రులకు సమాచారం ఇచ్చి హరిభేజి అంత్యక్రియలు నిర్వహించారు. హరిభేజి కుమారుడు సుగ్రీవ్ సింగ్ ఆమె చితికి నిప్పటించాడు.