Site icon NTV Telugu

KCR : సుప్రీం కోర్టులో కేసీఆర్ వేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

Kcr

Kcr

కేసీఆర్ వేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. సుప్రీంకోర్టులో ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పిటిషన్‌పై రేపు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. జస్టిస్ నర్సింహారెడ్డి రెడ్డి కమిషన్ సమన్ల పై జూలై 1న హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు లో సవాలు చేశారు కేసీఆర్. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై విద్యుత్ కమిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్.. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది.

 Minister Rama Naidu: ఆ గొప్ప వ్యక్తి ఆలోచనతో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం..

తనకు నోటీసులివ్వడం విచారణకు పిలవడంపై న్యాయపోరాటం చేస్తానని కేసీఆర్ అంటున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. కమిషన్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కేసీఆర్‌కు నోటీసు పంపిన విచారణకు రాలేదని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ తెలిపింది. దీంతో విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. కాగా, తెలంగాణ హైకోర్టు తీర్పును మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

 Bhojshala Complex: ‘భోజ్‌శాల’ కాంప్లెక్స్‌పై 2000 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించిన ఏఎస్‌ఐ..

Exit mobile version