NTV Telugu Site icon

Minister Savita: నేతన్నలకు అండగా టీడీపీ: చేనేత సంక్షేమ శాఖ మంత్రి

Minister Savita

Minister Savita

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు చేనేత సంక్షేమ శాఖ మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో చేనేత కళాకారులు ఎన్నో బాధలు అనుభవించారన్నారు. చేనేత కళాకారుల కలలు మరుగున పడ్డాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కళాకారులకు ఎంతో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడ స్టెల్లా కాలేజ్ నుంచి పంట కాలువ రోడ్డు వరకు వాక్ చేనేత కళాకారులు నిర్వహించారు. చేనేత కళాకారులతోపాటు వాక్ లో చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ టెక్స్టైల్స్ రేఖా రాణి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత పాల్గొన్నారు. యువత.. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలను ధరించి వాక్ కు హాజరయ్యారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటూ నినాదాలు చేశారు.

READ MORE: Supreme court: ఏకంగా సుప్రీంకోర్టుపై హైకోర్టు న్యాయమూర్తి విమర్శలు.. నేడు విచారణ..!

ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. చేనేత కళాకారుల కలలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. 2014-19లో కేవలం 58 రోజుల్లో 34వేల ఎకరాలిచ్చారని..గత ఐదేళ్ళలో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందన్నారు. రోడ్లు చాలా తవ్వేసారు.. కొన్ని ఇళ్ళ డోర్లు దొంగిలించారు.. 30 రోజుల్లో కంప తొలగించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. కంప తొలిగిస్తే రైతులు వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయో చూసుకుంటారన్నారు. కౌలు రైతులకు గత ఐదేళ్ళలో కౌలు సరిగా ఇవ్వలేదని.. కౌలు రైతుల కౌలు సమయం పెంచుతున్నామని స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేదలకు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఐఐటీ నిపుణుల నివేదిక ఇంకా రావాల్సి ఉందని..మరొక రెండు నెలలు ఇంకా స్టడీ చేయాల్సి ఉందన్నారు.