Supreme court: సుప్రీంకోర్టు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. తనకు సంబంధించిన కేసును తానే విచారణ చేయబోతుంది. పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ షెరావత్ తమపై చేసిన ఆరోపణలను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవాళ (ఆగస్టు7) ఎంక్వైరీ చేయనుంది. హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఎలా స్పందించనుందనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఓ కోర్టు ధిక్కార కేసులో తానిచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంపై పంజాబ్ హర్యానా ఉన్నత న్యాయస్థాం జడ్జ్ షెరావత్ హాట్ కామెంట్స్ చేశారు.
Read Also: IND vs SL: మూడో వన్డే మ్యాచ్ టైగా ముగిస్తే.. సూపర్ ఓవర్!
సుప్రీం కోర్టు తనను కాస్త ఎక్కువ ఊహించుకుంటోంది.. అదే సమయంలో హైకోర్టును కాస్త తక్కువ చేసి చూస్తుంది అని అనుకుంటోందని పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జ్ షెరావత్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు రాజ్యాంగంలో ప్రత్యేక స్థాయి ఉంది.. దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా ఆదేశాలు ఇచ్చేందుకు వీలు లేదని వ్యాఖ్యనించారు. పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షెరావత్ చేసిన ఈ వ్యాఖ్యల అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారమే సుమోటోగా విచారణ చేసేందుకు స్వీకరించింది.