NTV Telugu Site icon

The Greatest Of All Time: ‘ది గోట్‌’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. రికార్డ్ ధర!

Vijay The Goat

Vijay The Goat

Vijay’s The GOAT OTT Rights: వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు (సెప్టెంబర్‌ 5) ది గోట్‌ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

ది గోట్‌ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్‌’ సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. రికార్డ్ ధరకు డీల్‌ పూర్తయినట్లు ఇండస్ట్రీ టాక్‌. తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ అన్ని భాషల హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప2 :ది రూల్‌’ డిజిటల్‌ రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు దక్కించుకున్న విషయం తెలిసిందే.

Also Read: Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!

ది గోట్‌ చిత్రంలో ప్రశాంత్‌, వైభవ్‌, లైలా, స్నేహ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అంతేకాదు టెక్నాలజీ సాయంతో ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో దివంగత నటుడు కెప్టెన్ విజయకాంత్‌ రూపాన్ని ఆవిష్కరించడం విశేషం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాకు యువన్‌ శంకర్‌రాజా స్వరాలు అందించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Show comments