టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని ఓ వృద్ధుడు నిరూపించాడు.. తన అద్భుతమైన గొంతుతో పంజాబీ పాట పాడి అందరిని అలరించాడు.. పాటకు తగ్గట్టుగా బిందె మీద దరువేస్తూ పాడుతున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచి ఆయన సంగీతంలో లీనమై పాడుతున్న తీరు జనాలను ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం ఈ పాటకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఈ పెద్దాయనకి పాటలు పాడటం హాబీ కావచ్చు. అందుకు ఆయన కంఠం.. ఇంట్లో ఉండే వస్తువులే వాయిద్య సంగీతాలు. ఓ పాత పాత్రని సంగీత పరికరంగా మలుచుకుని ‘జిదా దిల్ తుట్ జాయే’ అనే అద్భుతమైన పంజాబీ పాటను పాడుకుంటూ సంతోషంలో మునిగి తేలుతున్నాడు..ఈ పాటలో స్క్రీన్ మీద నూర్జహాన్ నటించారు. ఇక పెద్దాయన వీడియో చూసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
ఆ వీడియోను చూసిన వారంతా కూడా అతనిపై పొగడ్తలతో అభినందిస్తున్నారు..బిందెను సంగీత వాయిద్యంగా మార్చుకుని, పాటకు తగ్గట్టుగా చేతులతో శబ్దాలు చేస్తూ ఆశ్చర్యపరిచారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో నెటిజన్ పాట నుండి సెటప్ వరకు అందంగా ఉంది అని వ్యాఖ్యానించారు. ‘పంజాబీ జానపద గాయాన్ని అద్భుతంగా పాడారు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
What a beautiful song. Simple yet elegant. If you understand punjabi. pic.twitter.com/H9z87Y4Sbn
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 28, 2023