NTV Telugu Site icon

TG Govt: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెలలోనే జారీ..!

Ration Card

Ration Card

కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నాలుగో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా.. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మరోసారి సమావేశం కావాల్సి ఉందని తెలిపారు. గత పదేళ్లలో నామమాత్రంగా రేషన్ కార్డులు ఇచ్చారని అన్నారు. అలాగే.. ఖరీఫ్ నుండి సన్న వడ్లకు క్వింటాల్‌కు 500 రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. జనవరి నుండి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వబోతున్నామని మంత్రి తెలిపారు.

Read Also: Suicide: పెళ్లై 7 ఏళ్లు.. పిల్లలు పుట్టడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అనుకుంటున్నాం.. గత ప్రభుత్వ హయాంలో 49,476 కార్డులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. అవి కూడా బై ఎలక్షన్ ఉన్న నియోజక వర్గాల్లో మాత్రమే ఇచ్చారన్నారు. ఒక సిష్టమేటిక్‌గా ఎక్కడ ఇవ్వలేదని.. తమ ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికి ఇస్తామని తెలిపారు. ఈనెల 21న మరోసారి భేటీ అయి ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.

Read Also: Kejriwal: రేపే కేజ్రీవాల్ రాజీనామా.. ఎల్జీ అపాయింట్‌మెంట్!

Show comments