NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీ రైతులకు శుభవార్త.. ఇవాళే నిధులు విడుదల

Nadendla Manohar

Nadendla Manohar

Andhra Pradesh: రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. గత రబీ సీజన్‌లో ధాన్యం విక్రయించి.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తీపికబురు చెప్పింది కూటమి ప్రభుత్వం.. పాత బకాయిలను అందించడానికి ఇవాళ్టి నుంచి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్‌.. ఈ రోజు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఈ రోజు పర్యటించనున్నారు.. ఇక, తన పర్యటనలో భాగంగా.. కలెక్టరేట్‌లో జరిగే ఒక కార్యక్రమంలో రైతులకు ధాన్యం బకాయిలకు సంబంధించిన చెక్కులను అందజేయనున్నారు. మొత్తంగా ఏపీలో ఇవాళ ధాన్యం రైతులకు 674 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఉదయం ఏలూరు, సాయంత్రం అమలాపురంలో రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్..

Read Also: Siddhnath Temple: ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి!

గత ప్రభుత్వంలో రబీ ధాన్యం విక్రయించిన రైతులకు 1,674 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది.. అయితే, రెండు విడతలుగా ధాన్యం బకాయిలు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.. ధాన్యం డబ్బులు చెల్లించాలంటూ కోనసీమ కలెక్టరేట్ వద్ద పలు సార్లు రైతులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి.. కోనసీమ జిల్లాలో రబీ పంటకు సంబంధించి 19,652 మంది రైతుల నుంచి ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు కొనుగోలు చేశారు. వారికి రూ.355.88 కోట్లను అందించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 10,823 మంది రైతులకు సంబంధించి రూ.201.25 కోట్లను రైతులకు పంపిణీ చేశారు. ఇక మిగిలిన 8,829 మంది రైతులకుగాను రూ.192 కోట్లను ఈ రోజు అమలాపురంలోని కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఈ బకాయిలను అందించనున్నారు..

Read Also:Siddhnath Temple: ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి!

కాగా, గత ప్రభుత్వంలో రైతులు చితికిపోయారని.. అన్నదాతల నుంచి సేకరించిన ఆహారధాన్యాలకు సకాలంలో బిల్లులు చెల్లించలేదంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణలు గుప్పించారు.. రైతుల బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు 1000 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఐదేళ్ల గత ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా చితికిపోయారని మనోహర్ ఆరోపించారు. రైతుల వద్ద కొన్న ఆహారధాన్యాలకు చెల్లించాల్సిన మొత్తం పూర్తిగా బకాయిలు పెట్టి రైతు ధైర్యం కోల్పోయేలా చేశారని మండిపడిన విషయం విదితమే.