The Goat Life : సెన్సార్ పూర్తి చేసుకున్న “ది గోట్ లైఫ్”మూవీ.. రన్ టైం ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.. సలార్ సినిమాతో ఈ హీరోకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా పృద్విరాజ్ సుకుమారాన్ నటించిన “ది గోట్ లైఫ్” మూవీ మార్చి 28న పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతోంది.బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా మలయాళం అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ గోట్‌లైఫ్ మూవీని తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈ సినిమా రన్ టైమ్ కూడా రివీలైంది. రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నిడివితో గోట్‌లైఫ్ తెలుగులో రిలీజ్ కానుంది..రెండు గంటల యాభై రెండు నిమిషాల లెంగ్త్‌తో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే సెన్సార్ సభ్యులు కొన్ని సీన్స్‌కు అభ్యంతరాలు చెప్పినట్లు తెలిసింది. దాంతో పదకొండు నిమిషాలు పైనే సినిమాను ట్రిమ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి సెన్సార్ నుంచి యూ ఏ సర్టిఫికెట్ వచ్చింది.గోట్‌లైఫ్ సినిమాలో అమలాపాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో పృథ్వీరాజ్‌సుకుమారన్, అమలాపాల్ మధ్య లిప్‌లాక్ సీన్ ఉండబోతున్నట్లు సమాచారం.. ఐదు నిమిషాల కంటే ఎక్కువ నిడివితోనే ఈ లిప్‌లాక్ సీన్ ఉంటుందని సమాచారం.
గోట్‌లైఫ్ సినిమాకు ఈ లిప్‌లాక్ హైలైట్‌గా ఉంటుందని మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి.ఇటీవల కాలంలో ఎక్కువ నిడివి గల లిప్‌లాక్ సీన్ ఉన్న సినిమా ఇదే అవుతుందని అంటున్నారు. కథ డిమాండ్ మేరకు లిప్‌లాక్ సీన్ పెట్టాల్సివచ్చిందిన ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ తెలిపింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్”ది గోట్ లైఫ్” మూవీకి మ్యూజిక్ అందించారు.ఈ సినిమా నుంచి ‘తేజమే రెహమానేనా..’ అనే లిరికల్ సాంగ్ ను ఇటీవల విడుదల చేశారు.’తేజమే రెహమానేనా..’ లిరికల్ సాంగ్ కు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా జితిన్ రాజ్ పాడారు. ఎమోషనల్ గా సాగే ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా కనిపిస్తారని మేకర్స్ ప్రకటించారు. సినిమా షూటింగ్ జరిగిన ఏడాదికి స్వయంగా వెళ్లిన రెహమాన్ ..అక్కడ హీరో క్యారెక్టర్ పడే సంఘర్షణను, ప్రకృతిని తానూ అనుభూతి చెందుతాడు. ఆ ఫీల్ తోనే ఈ పాట కంపోజ్ చేసినట్లు రెహమాన్ లిరికల్ వీడియోలో వెల్లడించారు.90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా “ది గోట్ లైఫ్” లో చూపించబోతున్నారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!