NTV Telugu Site icon

Love Matter: అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు..

Murder

Murder

ప్రేమించే ముందు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత.. అడ్డు తొలగించుకోవడానికి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అందుకే ప్రేమించే ముందే.. భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ప్రేమించాలి. అయితే తాజాగా.. ప్రేమించిన ప్రియుడిని కాదనుకునేందుకు హత్య చేసింది ప్రియురాలు. ఈ ఘటన హర్యానాలోని తిక్రీ గ్రామంలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిక్రి గ్రామంలోని ఓ ఇంట్లో యువకుడి మృతదేహం ఉందని తమకు సమాచారం అందిందని సదర్ పోలీస్ స్టేషన్ తెలిపింది. సమాచారం అందుకున్న పోలీస్‌స్టేషన్‌, క్రైమ్‌ సీన్‌, ఎఫ్‌ఎస్‌ఎల్‌, వేలిముద్రల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. ఘటనా స్థలిలో ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడంతో మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. ఆదివారం మృతుడి గదిలో సోదాలు చేయగా ఓ నంబర్ దొరికింది. దాని ఆధారంగా మృతుడు విక్కీ (28)గా గుర్తించారు. ఈ ఘటనపై మృతుడి బంధువులకు సమాచారం అందించారు. కాగా.. పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై మృతుడి సోదరుడు హత్య కేసు నమోదు చేశాడు. విక్కీ ఎనిమిదేళ్లుగా గురుగ్రామ్‌లో నివసిస్తున్నాడని, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పెట్ కేర్ (డాగ్ కేర్)గా పనిచేస్తున్నాడని చెప్పాడు.

Beer Side Effects : రోజూ బీర్ తాగుతున్నారా? ఇవి తెలుసుకోకుంటే డేంజర్లో పడ్డట్లే..

మరోవైపు.. ప్రాథమిక విచారణలో ఘటనకు పాల్పడిన వ్యక్తిపై ఎలాంటి క్లూ లభించలేదని పోలీసులు తెలిపారు. అనంతరం సాంకేతిక సహకారంతో ఫోన్ వివరాలు, సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. దీంతో ఓ అమ్మాయిని గుర్తించారు. అనంతరం పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె బహరంపూర్‌కు చెందిన నీతు (34) అలియాస్ నిషాగా గుర్తించారు. కాగా.. పోలీసులు ఆమెను విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.

పోలీసుల విచారణలో.. నీతు, విక్కీ దాదాపు 6 సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. విక్కీ నీతు జీవితంలో మరింత జోక్యం చేసుకోవడం ప్రారంభించాడని.. ఆ కారణంగా ఆమె విక్కీని వదిలించుకోవాలని కోరుకుంది. ఈ క్రమంలో.. నీతు, ఆమె సోదరుడు శనివారం రాత్రి విక్కీ ఇంటికి వెళ్లారు. అక్కడ నీతు సోదరుడు, విక్కీ మద్యం సేవించారు. విక్కీ మద్యం మత్తులోకి వెళ్లిపోయాక.. నీతు సోదరుడు ఇంట్లో ఉంచిన పాన్‌తో విక్కీ మెడపై, తలపై గట్టిగా కొట్టాడు. దీంతో.. విక్కీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు.. ఈ ఘటనకు పాల్పడిన తర్వాత, నీతు విక్కీ ఫోన్‌తో పారిపోయింది. అనంతరం నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టి దొరకపట్టారు. నిందితురాలిని రెండు రోజుల రిమాండ్‌కు తరలించి విచారిస్తున్నారు. మరోవైపు నీతూ సోదరుడి గురించి గాలిస్తున్నారు.