తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. దీంతో ప్రాజెక్ట్‌లు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జలాశయాల్లోకి భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు రాజధాని హైదరాబాద్ లో భారీ వర్షాలతో తడిసి ముద్ధవుతోంది. జూలై నెల మొత్తం కురవాల్సిన వర్షం 24 గంటల్లోనే నమోదైంది. దీంతో నగరంలోని లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి.
Read Also: Andhra Pradesh High Court: R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
మరోవైపు .. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు నిండుకున్నాయి. వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్ నగర్, షాబాద్ నుంచి జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఈ క్రమంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయానికి చెందిన రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.
Read Also: Capsicum Price: టమాటా కంటే క్యాప్సికమ్కు ధర ఎక్కువ..! ఎక్కడంటే
ఈ నేపథ్యంలో జంట జలాశయాల్లోని రెండు గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. ఈ రెండు గేట్ల ద్వారా 700 క్యూసెక్కలు నీరును కిందకు రిలీజ్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో మూసీ నదీ ప్రవాహం పెరుగనుంది. దీంతో మూసీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గేట్ల ఎత్తివేత కార్యక్రమంలో జలమండలి ఎండీ దానకిశోర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇక ఉస్మాన్ సాగర్ లో 1100 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1784.70 అడుగులకు చేరింది. మరో వైపు హిమాయత్ సాగర్‌కు 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1761.20 అడుగులుగా ఉంది.