NTV Telugu Site icon

Alluri Sitarama Raju: విప్లవ జ్యోతి… అల్లూరి సీతారామరాజుకి అశ్రునివాళి

Alluri 1

Alluri 1

విప్లవం పేరు చెబితే వెంటనే ఠక్కున గుర్తొచ్చేది… విప్లవ వీరుడు… తెలుగు జాతి ముద్దు బిడ్డ..అల్లూరి సీతారామరాజు…!! బ్రిటీషర్లను గడగడలాడించి,వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన వీరపుత్రుడు.. భరతమాత ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు. అల్లూరి పేరు చెబితే మన్యం పులకిస్తుంది. గుండె ఉప్పొంగుతుంది. ఆ పేరు మన్యానికి విప్లవ నినాదం…ఉప్పొంగే ఆవేశానికి ప్రతీక అల్లూరి. ఉరకలెత్తించే ఉత్సాహం..తెల్లదొరల పెత్తనానికి ఉత్పాతం లాంటిది ఆయన పేరు. అడుగు పిడుగై..అగ్గి పిడుగై మాట తూటాగా పేలి..తెల్లవాడి గుండెల్లో నిదురించిన పౌరుషాగ్ని మన అల్లూరి. అల్లూరి విప్లవ విధానం, నినాదమై ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశమైంది. నీలో దేశభక్తిని పాదుకొల్పితే అది అల్లూరి సీతారామరాజు! సరిగ్గా 99 ఏళ్ల క్రితం ఆ విప్లవ జ్యోతి మన నుంచి దూరమైంది. అల్లూరి సీతారామరాజు వర్థంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి.1922 ఆగష్టు 22 న ఆరంభమైన ఈ మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూలై మొదటివారంలో అంతమైంది. సీతారామరాజు తల్లి 1953 ఆగష్టు 30న, తన 77వ యేట మరణించింది. అతని సోదరి సీతమ్మ భీమవరంలో 1964 జూలై 8న కన్నుమూసింది.

Alluri 1a

మే 7వ తేదీ వచ్చిందంటే అల్లూరి సీతారామరాజు గుర్తుకువస్తారు. సరిగా 99 ఏళ్ళక్రితం ఆయన దేశం కోసం పోరాడి బ్రిటిషర్ల తుపాకీ గుళ్లకు కన్నుమూసి వీరమరణం పొందారు. అప్పటికీ ఇప్పటికీ ఆయన దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అల్లూరి సీతారామరాజు జూలై 4, 1897న ఆంధ్ర ప్రదేశ్‌లోని భీమవరం సమీపంలోని మొగల్లు అనే గ్రామంలో జన్మించారు. ఆయన తన ప్రాథమిక పాఠశాల విద్యను తన స్వగ్రామానికి సమీపంలోని వివిధ ప్రదేశాలలో పూర్తి చేసాడు మరియు తన ఉన్నత పాఠశాల మరియు విశ్వవిద్యాలయ విద్యను అభ్యసించడానికి 15 సంవత్సరాల వయస్సులో విశాఖపట్నం వెళ్ళారు.బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు అల్లూరి ఉత్తమంగా గుర్తుండిపోతాడు, దీనిలో అతను విదేశీయులపై తిరుగుబాటు చేయడానికి విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాల గిరిజన ప్రజలను సంఘటితం చేశాడు.

Read Also: Maoist: జగిత్యాలలో మావోయుస్టుల వార్నింగ్‌ లెటర్‌.. కొత్తగూడెంలో భారీ ఎన్‌కౌంటర్..

అతను బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి బెంగాల్ విప్లవకారుల నుండి ప్రేరణ పొందారు అల్లూరి సీతారామరాజు. రంపా తిరుగుబాటు 1922 మరియు 1924 సంవత్సరాల మధ్య జరిగింది. అల్లూరి మరియు అతని మనుషులు అనేక పోలీసు స్టేషన్లపై దాడి చేసి అనేక మంది బ్రిటీష్ అధికారులను హతమార్చారు మరియు వారి యుద్ధం కోసం ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని దొంగిలించారు. మద్రాసు అటవీ చట్టం, 1882 గిరిజన ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టిన అల్లూరిని చివరకు పట్టుకోగలిగారు.

వారు అతనిని చెట్టుకు కట్టివేసి, 7 మే 1924న కాల్చి చంపారు. ప్రజలు ఆయన్ని ‘మన్యం వీరుడు’ బిరుదుతో సత్కరించారు. ఈ గొప్ప దేశభక్తుని స్మరించుకోవడం అందరికీ కర్తవ్యం. 1986లో అల్లూరి సీతారామ రాజు స్మారక స్టాంపును ఇండియా పోస్ట్ విడుదల చేసింది.కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. విప్లవవీరులు, స్వాతంత్ర్య సమర వీరులకు అల్లూరి ఒక స్ఫూర్తి. సీతారామరాజు విగ్రహాలు తెలుగురాష్ట్రాల్లో అనేక చోట్ల ప్రతిష్టించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గత ఏడాది అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరై ఆ మన్యం వీరుడికి ఘన నివాళి అర్పించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహం అందరికీ స్ఫూర్తినిస్తోంది. అల్లూరి పోరాటస్ఫూర్తిని ప్రధాని కొనియాడారు. అల్లూరి మరణం లేని విప్లవ వీరుడు.. తెలుగు జాతికి, దేశానికి స్ఫూర్తి ప్రధాత.. అడవి బిడ్డలకు ఆరాధ్య దైవం.

Read Also: Russia: రష్యాలో మరో ప్రముఖుడిపై దాడి.. ఉక్రెయిన్, అమెరికా పనే అని ఆరోపణ..

Show comments