NTV Telugu Site icon

Viral Photo: ఒకే ఫ్రేమ్‭లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, అత్యంత పొట్టి మహిళ.. ఎక్కడ కలిశారంటే?

Viral Photo

Viral Photo

Viral Photo: సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, పొట్టి మహిళను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చింది. వీరిద్దరూ లండన్ టవర్ బ్రిడ్జి ముందు నిలబడి ఫోటో కూడా దిగారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ రుమీసా గెల్గి, ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే ఫోటోలు, వీడియోలను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. వీరిద్దరూ కలిసినప్పుడు టీ తాగారు, ఇంకా పిజ్జా కూడా తిన్నారు.

Also Read: India-Canada: కెనడాలో మరిన్ని కాన్సులర్ క్యాంపులను రద్దు చేసిన భారత్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ రుమేసా గెల్గి టర్కీ నివాసి. ఆమె ఎత్తు ఏడడుగుల కంటే ఎక్కువ. వీవర్ సిండ్రోమ్ అనే అరుదైన పరిస్థితి కారణంగా గెల్గి ఎత్తు 7 అడుగుల 0.7 అంగుళాలు (215.16 సెం.మీ.)కు చేరుకుంది. దింతో గెల్గి పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. గెల్గి జీవించి ఉన్న అత్యంత ఎత్తైన మహిళ అనే బిరుదును కలిగి ఉంది. గెల్గి ఎత్తు, వీవర్ సిండ్రోమ్ కారణంగా ఎక్కువగా వీల్ చైర్‌ను ఉపయోగించాల్సి వస్తుంది. ఆమె జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతోంది.

Also Read: AUS vs IND: టాస్ గెలిచిన బుమ్రా.. నితీశ్‌ రెడ్డి అరంగేట్రం! సీనియర్స్ అవుట్

ప్రపంచంలోనే అతి చిన్న మహిళ విషయానికి వస్తే.. భారత్ కు చెందిన జ్యోతి అమ్గే తన కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నివసిస్తున్నారు. ఆమె ఎత్తు 2 అడుగులు. అంటే 63 సెంటీమీటర్లు. ఈమెకు అకోండ్రోప్లాసియా అనే వ్యాధి ఉంది. ఇది మరుగుజ్జును కలిగిస్తుంది. ఆమె కుటుంబంలో తల్లి, తండ్రి, సోదరుడు ఉన్నారు. జ్యోతికి పెళ్లి ఇష్టం లేదు. ఒంటరిగా ఉండాలనుకుంటోంది. ఒక ఇంటర్వ్యూలో, జ్యోతి ప్రతి ఒక్కరినీ తన స్నేహితులుగా భావిస్తానని చెప్పింది. ఆమె స్వేచ్ఛగా ఉండాలనుకుంటోంది. ఎవరినీ అడ్డగించడం ఆమెకు ఇష్టం ఉండదని పేర్కొంది. జ్యోతి 1993 డిసెంబర్ 16న నాగ్‌పూర్‌లో జన్మించింది. జ్యోతి వ్యాధి ఎముకలలో అకోండ్రోప్లాసియా, దీని కారణంగా ఎత్తు పెరగదు. జ్యోతికి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఆమె తరచూ తన జీవితానికి సంబంధించిన కొన్ని వీడియోలను ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంది.

Show comments