NTV Telugu Site icon

KA Movie: ఆకట్టుకుంటున్న అందాల రాశి “తన్వీ రామ్”.. “క” లో రాధ క్యారెక్టర్ ఫస్ట్ లుక్

Ka Movie

Ka Movie

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం “క”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో. రొటీన్ కథలకు స్వస్తి చెప్పి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ నేపథ్యంలో సాగే కథాంశాన్ని ఎంచుకొని అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తన పుట్టిన రోజు జులై 15న చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా “క”చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

READ MORE: Breaking News: హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల అరెస్ట్..

“క” సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్న ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు.

READ MORE: Arekapudi Gandhi: నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన ఎమ్మెల్యే గాంధీ..

తాజాగా “క” సినిమా నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ తన్వీ రామ్ నటిస్తున్న రాధ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ట్రెడిషినల్ లుక్ లో దాండియా ఆడుతూ అందంగా ఆకర్శనీయంగా ఉంది. ఆమె చేస్తున్న రాధ క్యారెక్టర్ కు “క” సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉండనుంది. బ్లాక్ బస్టర్ మూవీ “2018” తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన తన్వీ రామ్ ఇప్పుడు “క” సినిమాతో మరోసారి తన అందంతో పాటు అభినయంతో ఇంప్రెస్ చేయబోతోంది.

Show comments