NTV Telugu Site icon

IND vs ENG: ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోరు దిశగా భారత్

Jaiswal

Jaiswal

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్ట్‌ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. క్రీజులో జైస్వాల్‌ (179), అశ్విన్ (5) ఉన్నాడు. జైస్వాల్ ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, 5 సిక్స్ లు ఉన్నాయి. టెస్టుల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు సాధించాడు జైశ్వాల్. కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో షోయాబ్ బషీర్, రెహన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీకి చెరో వికెట్ దక్కింది.

Read Also: Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. త్వరలోనే ఆ హామీల అమలు

రెండో టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు రోహిత్, జైస్వాల్‌లు ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడారు. ఇద్దరు బౌండరీలకు పోకుండా.. సింగిల్స్ తీశారు. ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో రోహిత్‌కు అరంగేట్ర స్పిన్నర్ షోయబ్ బషీర్‌ పెవిలియన్ చేర్చాడు. 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 14 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ శర్మ అనంతరం క్రీజులోకి వచ్చిన శభ్‌మన్‌ గిల్‌ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా ఆపై వేగం పెంచాడు. ఆ తర్వాత 34 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక.. భారత బ్యాటింగ్ లో శ్రేయాస్ 27, రజత్ పటిధార్ 32, అక్షర్ పటేల్ 27, శ్రీకర్ భరత్ 17 పరుగులు చేశారు.

Read Also: Husband locks up wife: 12 ఏళ్లుగా ఇంట్లోనే భార్యను నిర్భందించిన భర్త.. కిటికీ నుంచే పిల్లలకు ఆహారం..

Show comments