NTV Telugu Site icon

Fargana Hoque: బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు.. రికార్డు బద్దలు

Fargana Hoque

Fargana Hoque

బంగ్లాదేశ్‌ తరఫున మహిళల వన్డే క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదైంది. ఇండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (జులై 22) జరుగుతున్న మూడో వన్డేలో ఫర్జానా హాక్‌ సెంచరీ చేసింది. (160 బంతుల్లో 107; 7 ఫోర్లు) ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు 2013 ఏప్రిల్ లో బంగ్లాదేశ్‌ తరఫున సల్మా ఖాతూన్ 75 పరుగులు చేసింది. ఆ స్కోకే ఇప్పటివరకు అత్యధిక స్కోర్‌. అయితే ఆ రికార్డును ఫర్జానా బద్దలు కొట్టింది. అంతకుముందు ఫర్జానా ఖాతాలో మరో 2 రికార్డులు కూడా ఉన్నాయి. బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు (56 మ్యాచ్‌ల్లో 25.83 సగటున 1240 పరుగులు), బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీల రికార్డు (9) ఫర్జానా పేరిట ఉన్నాయి.

Samantha Break: ఏడాది రెస్ట్.. సమంతకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?

అంతేకాకుండా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫర్జానా 160 బంతులు ఎదుర్కొంది. మహిళల క్రికెట్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఐదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కింది. టీమిండియా తరుపున బ్యాటర్‌ దీప్తి శర్మ కూడా ఉన్నారు. ఈ జాబితాలో ఐర్లాండ్‌ అన్నె ముర్రే (171) టాప్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ఫర్జానా రికార్డు సెంచరీ సాధించగా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఫర్జానాతో పాటు మరో ఓపెనర్‌ షమీమా సుల్తానా (52) అర్ధసెంచరీతో రాణించింది. కెప్టెన్‌ నిగర్‌ సుల్తానా (24), ఆఖర్లో శోభన మోస్త్రీ (23 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 2, దేవిక వైద్య ఓ వికెట్‌ పడగొట్టారు.

Teacher Harassment: యువతిపై మాష్టారు లైంగిక వేధింపులు.. గుడ్డలూడదీసి మరీ..

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. 49.3 ఓవర్లలో ఆలౌట్ కాగా.. మ్యాచ్ టైగా ముగిసింది. స్మృతి మంధన (59) అర్ధశతకంతో మెరవగా.. హర్లీన్‌ డియోల్‌ (77), జెమిమా రోడ్రిగ్స్ (33 నాటౌట్) గా ఉంది. బంగ్లా బౌలర్లలో నహిద అక్తర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తర్‌ ( 2 ), సుల్తానా ఖాతూన్‌, రాబియా ఖాతూన్, ఫామిమా ఖాతూన్‌ తలో వికెట్‌ తీశారు.

Show comments