NTV Telugu Site icon

Hyderabad: సెల్‌ఫోన్ వాడొద్దని మందలించిన తండ్రి.. కూతురు అదృశ్యం

Hyderabad Missing

Hyderabad Missing

నేటి తరంలో మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువైపోయింది. పెద్దల నుంచి మొదలు పెడితే పిల్లల వరకు అతిగా వాడేస్తున్నారు. అన్నం లేకుండా అయినా ఉంటారేమో కానీ.. ఈరోజుల్లో ఫోన్ లేకుండా ఉండటం కష్టమైపోయింది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వల్ల మొబైల్ ఫోన్ వాడకం మరింత పెరిగింది. దీంతో.. ఎక్కువగా పిల్లలు ఫోన్లకు బాగా అలవాటు పడిపోయారు. అయితే.. పిల్లల మొబైల్ ఫోన్ల వాడకంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా ఫోన్ వాడొద్దని వారికి సూచిస్తున్నా.. పిల్లలు మాట వినడం లేదు. కొందరైతే క్షణికావేశంలో ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు. మరికొందరు తల్లిదండ్రులు మందలించడంతో అదృశ్యమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. తాజాగా.. ఇలాంటి ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

Read Also: World’s Best Actors: ప్రపంచ ఉత్తమ నటుల జాబితా విడుదల.. భారత్‌ నుంచి ఒకే ఒక్కరు..

సెల్ ఫోన్ వాడొద్దని తండ్రి మందలించడంతో కూతురు అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పద్మశాలి టౌన్ షిప్‌లో వరుసు రాజు.. భార్య తన ఇద్దరు కుమారులు ఒక కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. కుమార్తె ఆరతి (19) ఈసీఐఎల్‌లోని ఒక కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే.. తన కూతురు ఫోను కంటిన్యూగా ఉపయోగిస్తుండడంతో ఫోన్ వాడొద్దని మందలించి సరిగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని మార్గానిర్దేశం చేశాడు. దీంతో ఆరతి ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా.. బంధువుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Beerla Ilaiah: వచ్చే ఏడాదిలో హరీష్, కేటీఆర్‌లకు సినిమా చూపిస్తాం..

Show comments