సెల్ ఫోన్ వాడొద్దని తండ్రి మందలించడంతో కూతురు అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పద్మశాలి టౌన్ షిప్‌లో వరుసు రాజు.. భార్య తన ఇద్దరు కుమారులు ఒక కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. కుమార్తె ఆరతి (19) ఈసీఐఎల్‌లోని ఒక కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతుంది.